హైదరాబాద్ నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల నీచపు సంస్కారానికి నిలువుటద్దంగా నిలిచింది ఈ ఘటన. కన్న కూతురిపై తల్లిదండ్రుల బలవంతపు ఒత్తిళ్లు ఎక్కువైపోవడంతో అభం శుభం తెలియని ఓ 16 ఏళ్ల బాలిక బలికావల్సి వచ్చింది. ఇలాంటి ఘోరమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లో భార్యభర్తలతో పాటు 16 ఏళ్ల కూతురు కూడా నివాసం ఉంటుంది.
అయితే తల్లిదండ్రులు తమ కూతురిని బిక్షాటన, వ్యభిచారం చేయాలంటూ తీవ్ర ఒత్తిడికి గురి చేసేవారు. విషయం ఏంటంటే..? కూతురిని తండ్రేమో బిక్షాటన చేయాలని, తల్లి ఏమో వ్యభిచారం చేయాలంటూ పట్టుబట్టారు. ఎట్టకేలకు తండ్రి మాటపై కూతురు బిక్షాటన చేస్తూ వచ్చింది. దీంతో పాటు వ్యభిచారం కూడా చేయాలంటూ తల్లి ఒత్తిళ్లు తీవ్ర తరం అయ్యాయి. ఈ క్రమంలోనే చైల్డ్ లైన్ సభ్యురాలు మహేశ్వరికి సదరు వ్యక్తులు కొందరు ఈ నెల 28న ఈ బాలిక విషయంపై వివరించారు. విషయం తెలుసుకున్న చైల్డ్ లైన్ సభ్యురాలు మహేశ్వరి హైదరాబాద్ లోని కొన్ని చోట్ల వెతికింది. ఎంత వెతికినా కూడా ఆ బాలిక జాడ కనిపించకపోవడవంతో అక్కడక్కడ ఆరా తీశారు.
అయితే ఈ క్రమంలోనే ఈనెల 6న ఖమ్మం బస్టాండ్ వద్ద బాలిక ఉన్నట్లు చైల్డ్ లైన్ సంస్థకు తెలిసింది. దీంతో వెంటనే ఆ బాలికను సంరక్షణలోకి తీసుకోవాలని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇక అనంతరం ఆ సంస్థ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను హైదరాబాద్ నుంచి తప్పిపోయి వచ్చానని ఆ బాలిక తల్లి వివరించే ప్రయత్నం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఆ బాలిక సొంత తల్లి ఆమేనా లేక మరొవరైన ఉండవచ్చా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.