ప్రేమలో పడటానికి అనేక మార్గాలున్నాయి. ప్రేమ ఎలా మొదలు అవుతుందో అది ఎక్కడికి దారితీస్తుందో ఎవరికి అర్థం కాదు. ఇంక ప్రేమలో పడ్డవారు తాము ప్రేమించిన వారి కోసం ఎలాంటి పనులు చేయడానికైన ఆలోచించారు. అలాంటి ఓ ప్రేమ కథ చిత్రంలో భర్త మరణంతో ఆ యువతి ఆక్రమంగా మన దేశంలో వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే అతడి మీద ప్రేమతోనే వచ్చిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైయింది.
వివరాల్లోకి వెళ్తే…. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ దళారీ హితేష్ జోషితో బంగ్లాదేశ్ కు చెందిన సిరిన అక్తర్ హుస్సేన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. హితేష్– సిరిన మధ్య 2016లో ఫేస్ బుక్ స్నేహం ఏర్పడటంతో ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలనికి ఒకరినినొకరు ప్రేమించుకున్నారు. తొలుత హితేష్ను కలుసుకోవాలని అనుకున్న సిరిన 2017 మార్చిలో 90 రోజుల విజిట్ వీసాపై భారత్కు వచ్చి… తిరిగి వెళ్లింది. ఆ తరువాత అతడి కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. అతని కోసం సిరిన అక్రమ మార్గంలో సరిహద్దులు దాటి భారత్ కు వచ్చేసింది.
బంగ్లాదేశ్ లో ఉన్న దళారుల ద్వారా కోల్ కతా చేరుకున్న సిరిన అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంది. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యుల ద్వారా సిరిన అక్తర్ గుత్తా సోను బిశ్వాస్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డులు సంపాదించింది . వీటిని ఉపయోగించుకోని అహ్మదాబాద్ వెళ్లి హితేష్ను కలిసింది. 2017 అక్టోబర్ నుంచి అక్కడి సనాతన్ అనే ప్రాంతంలో వీళ్లిద్దరూ సహ జీవనం చేయసాగారు. 2018లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. 2020లో సిరిన.. సోను పేరుతో అహ్మదాబాద్ రీజనల్ పాస్పోర్టు కార్యాలయం నుంచి పాస్పోర్టు కూడా పొందింది. దీన్ని వినియోగించి భారతీయురాలిగా బంగ్లాదేశ్ వెళ్లి తన కుటుంబీకులను కలిసి వచ్చింది.
భర్త మరణంతో వెలుగులోకి.. అలా రహస్యంగా సాగిపోతున్న వారి జీవితం హితేష్ మరణంతో వెలుగులోకి వచ్చింది. గత నెలలో హితేష్ అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు. ఆ తరువాత సిరిన హితేష్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆస్తి విషయాలపై చర్చించింది. ఆస్తుల పంపకం విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన హితేష్ తల్లిదండ్రులు సిరినను ఉద్దేశించి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీ అంటూ దూషించారు. ఆ మాట చివరకి సనాతల్ పోలీసులకు అందింది. దీంతో పోలీసులు సిరినను అరెస్టు చేశారు.
సిరినకు సోను పేరుతో ఆధార్, పాన్ కార్డులు తయారు చేసిన ఇచ్చిన నిందితుల కోసం అహ్మదాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. . హైదరాబాద్ కేంద్రంగా బోగస్ గుర్తింపు పత్రాలు పొందిందనే సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో ఓ ప్రత్యేక బృందాన్ని ఆదివారం హైదరాబాద్ పంపారు. సిరిన కేవలం హితేష్ పై ఉన్న ప్రేమతోనే ఇలా అక్రమంగా వచ్చిందని, ఈ కేసులో మరే ఇతర కోణం లేదని అహ్మదాబాద్ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికి ఆమె చేసింది నేరం కావటంతో అరెస్టు చేశామని వివరిస్తున్నారు.