నేటికాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావీవరుసలు మరచి పరాయి సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. విలువల కంటే క్షణిక కాల శారీరక సుఖానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో హత్యలు చేయడం లేదా హత్యకు గురికావడం జరుగుతుంది. ఇలా పరాయి వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యలను కొందరు భర్తలు దారుణంగా చంపిన ఘటనలు అనేకం జరిగాయి. అయితే తాజాగా తన భార్య పరాయి వాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ భర్త వింత పని చేశాడు. సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను అతడికే ఇచ్చి పెళ్లి చేశాడు. ఇ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.
పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లాలోని శాంతిపూర్ లో అమూల్యా దేబ్ నాథ్, దీపాలీ దేబ్ నాథ్ అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలీ ని అముూల్యా దేబ్ నాథ్ 24 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడికి ఇటీవల పెళ్లి చేశారు. కోడలు కొన్ని రోజుగా పుట్టింట్లో ఉంటోంది. అంతేకాక అమూల్యా దేబ్ నాథ్ వృత్తిరీత్యా వేరే రాష్ట్రంలో ఉండేవారు నెలకు ఒక్కసారి ఇంటికి వచ్చి..వెళ్తుండేవాడు. భర్త రోజుల తరబడి దూరంగా ఉండటంతో దీపాలీ బుద్ది పక్కదారిపట్టింది. అదే గ్రామంలో ఉంటున్న భర్త సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లపాటు గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగించారు.
అయితే భార్య, తన తమ్ముడు నడుపుతున్న ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. కానీ ఆవిషయాన్ని నిరూపించేందుకు తన వద్ద సరైన ఆధారాలు లేవు. దీంతో సరైన సమయం కోసం కొన్నాళ్లపాటు వేచి చూశాడు. ఓ రోజు వారు ఏకంతంగా గడిపే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. విషయాన్ని సాక్ష్యాలతో సహా గ్రామస్థులకు తెలియజేశాడు. ఇలా పరాయి మగాడి సుఖం కోసం ఎంపర్లాడే భార్య తనకు వద్దని ఖరాఖండిగా చెప్పేశాడు అమూల్యా. అంతటితో ఆగక.. ఊర్లో వారి సూటిపోటీ మాటలకు చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
దీపాలీ వివాహేతర సంబంధం పెట్టుకున్న తన సోదరుడు కిశబ్ కు ఇరుగుపొరుగు సమక్షంలో వివాహం జరిపించాడు. అతడు చేసిన పనికి స్థానికులు షాక్ అయ్యారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొందరు మద్దతు ఇవ్వగా..మరికొందరు వ్యతిరేకించారు. ఏది ఏమైనా అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యలను చంపే భర్తలు ఉన్న ఈ కాలంలో.. అమూల్యా ఈ పని చేశాడు. తాను ఇబ్బంది పడకుండా, తన భార్యను, సోదరుడికి హానీ చేయకుండా పెళ్లి చేసి మంచి పని చేశాడని కొందరు అభిప్రాయాపడుతున్నారు.