హైదరాబాద్ లో కొందరు స్పాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ముఠాలను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వ్యభిచార నిర్వహిస్తున్న మరో ముఠా పోలీసులకు పట్టుబడింది.
హైదరాబాద్ నగరంలో కొందరు స్పాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్నాయి. ఉద్యోగాలకోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువతులకు ఎక్కువ జీతాలను ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నారు కొందరు స్పా నిర్వాహకులు. ఇటువంటి చర్యల వల్ల ఎంతో మంది యువతులు.. తమ జీవితాలను ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వ్యభిచార ముఠాలను పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ లోని ఫిలింనగర్ ప్రాంతంలో ఓవ్యక్తి కొంత కాలంగా ఆలివర్ లేక్ స్పా పేరుతో స్పా సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో స్పా ముసుగులో క్రాస్ మసాజ్ చేస్తున్నాడు. అతడు నిర్వహిస్తున్న ఈ వ్యభిచారం విషయంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో బంజారాహిల్స్ ఎస్ఐ హరీశ్వర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో ఆ మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. ఆ స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గా వారు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను మసాజ్ థెరపిస్టుల పేరుతో నగరానికి తీసుకువచ్చి వ్యభిచారానికి పాల్పడుతున్నట్లుగా పోలీసులు నిర్థారించారు.
మసాజ్ థెరపిస్టుల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న యువతులకు రూ. 21వేల చొప్పున చెల్లిస్తున్నారు. కస్టమర్ల నుంచి రూ.2వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిబంధనలకు విరుద్దంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మేనేజర్ సుమంత్, యజమాని సోమా కమల్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న అలివర్ లేక్ స్పాను సీజ్ చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడే వారి పట్ల యువతులు అప్రమత్తతో ఉండాలని పోలీస్ వారు సూచించారు. మరి.. ఇలా స్పా, మసాజ్ సెంటర్ ముసుగులు జరుగుతున్న ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.