పుణ్యానికి పోతే పాపం ఎదురైనది అన్నట్లు జరిగింది ఇద్దరు వ్యక్తుల పరిస్థితి. తమ పని తాము వెళ్తుంటే.. మార్గం మధ్యలో వారి కారుకు మధ్యలో చిక్కుకున్న ఓ గద్ద ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా కారును ఆపి ఆ గద్దను తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మరో వాహనం వారిద్దరని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. ఈ ఘటన ముంబై శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. మే30న జరిగిన ఈ ప్రమాదాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో చిత్రీకరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముంబైకి చెందిన 43 ఏళ్ల అమర్ మనీష్ జరీవాల మలద్ కారులో బాంద్రా-వర్లి సముద్రం మార్గం మీద నుంచి మాలద్ వెళ్తున్నాడు. శ్యామ్ అనే తన కారు డ్రైవర్ తో బాంద్రా సమీపంలో పొడవైన వంతెన పై ప్రయాణిస్తున్నారు. ఇదే సమయంలో ఓ గద్ద ఉన్నట్టుండి జరీవాల కారు మధ్యలో అకస్మాత్తుగా వచ్చి ఇరుక్కుంది. వెంటనే కారు ఆపాలంటూ డ్రైవర్ శ్యామ్ సుందర్ ని జరీవాల కోరాడు. ఇద్దరూ కారు దిగి రోడ్డుకు ఓ వైపు నిల్చుని.. గద్దను ఎలా రక్షించాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా అటుగా వెళ్తున్న ఓ టాక్సీ వీరిద్దరిని వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి ఇద్దరూ చెరో వైపు ఎగిరిపడ్డారు జరీవాల అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. శ్యామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ అక్కడ తుది శ్వాస విడిచాడు.
ఇదీ చదవండి: అంబులెన్స్ లో వచ్చి మరీ ఓటు వేసిన ఎమ్మెల్యే! వీడియో వైరల్వంతెనపై వీరు గద్దను కాపాడదామన్న ఆలోచనలోనే ఉండిరపోయారే తప్పించి.. వెనుక నుంచి వచ్చే వాహనాలను చూసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో టాక్సీ డ్రైవర్ తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కనిపిస్తున్న చూసుకోకుండా వెళ్లి వారిని ఢీకొట్టడం వీడియోలో గమనించోచ్చు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.