మనిషిని పశువుల మార్చే వాటిల్లో ప్రధానమైనది గంజాయి. ఈ మహమ్మారికి బానిసైన ఎందరో యువత.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో వావివరుసల మరచి ఎన్నో ఆకృత్యాలకు తెగబడుతున్నారు. అంతేకాక ఈ గంజాయి వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా గంజాయి కారణంగా ఓ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి.. కుటుంబం మొత్తాన్ని గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. ఈ ఘటనలో భార్య, నలుగురు పిల్లలు అక్కడికక్కడే చనిపోగా.. మరొక పాప ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. కుటుంబం సభ్యులను చంపిన అనంతరం సదరు వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఒళ్లుగగ్గురు పుట్టించే ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై ప్రాంతంలోని వరంతవాడి గ్రామానికి చెందిన పళణి, వలిని అనే భార్యాభర్తలు పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. వారికి త్రిష, మోనిషా, శివశక్తి, ధనుష్, భూమిక అనే నలుగురు పిల్లలు ఉన్నారు. స్థానికులు తెలిపిన ప్రకారం..పళణి చాలా మంచి వాడు. తాను పండించిన పంటలు కొంత పేదలకు కూడా సాయంగా ఇచ్చేవాడు. పిల్లలను సైతం ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సాటి వారికి సాయం చేయడంలో ఎప్పుడు పళణి ముందుండే వాడు. అలా కరోనా ముందుకు వరకు కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తుండేవాడు. అయితే కరోనా మహమ్మారి వచ్చి..అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. కరోనా తరువాత పళణి కుటుంబ ఆర్ధికంగా బాగా చితికిపోయింది. అంతేకాక కరోనా సమయంలో ఇంటి అవసరాల కోసం చేసిన అప్పులు బాగా పెరిగిపోయాయి.
ఈ క్రమంలో ఆర్ధిక సమస్యల కారణంగా పళణి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. అంతేకాక ఇంటికి రాగానే భార్య వలిని, పళణితో గొడవ పెట్టుకునేది. దీంతో పళణి గంజాయి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. కొన్ని రోజులకు గంజాయిగా బానిసగా మారాడు. అంతేకాక ఇంటికి రాగానే భార్య గొడవ పెట్టుకునేది. ఇదే సమయంలో వలిని పై పళణి అనుమానం పెంచుకున్నాడు. సోమవారం కూడా మరోసారి ఈ దంపతులు గొడవపడ్డాడు. గంజాయి మత్తులో ఉన్న పళణి..గొడ్డలితో మొదట భార్యను నరికి చంపాడు. అనంతరం పిల్లలను ఒక్కొక్కరిగా పట్టుకుని అత్యంత దారుణంగా నరికి చంపాడు. అందరు మరణించారు అని భావించిన తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అక్కడి చేరుకున్న పోలీసులు భూమిక అనే చిన్నారి బ్రతికే ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఆమె స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. భార్య, నలుగురు పిల్లలు మరణించారు. ఈ వార్త తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరువణ్ణాలై ప్రాంతంలో గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని, చాలా మంది గంజాయిని వినియోగిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఎంతో మంచి వ్యక్తిగా పేరున పళణి కేవలం గంజాయి కారణంగా మృగంలా మారి..కన్నబిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు. మరి.. గంజాయి మత్తులో జరుగుతున్న ఇలాంటి దారుణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.