ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో అనేక దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమ విషయంలో ఎక్కువగా యువతులపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమించాలంటూ కొందరు యువకులు.. యువతలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఆడపిల్లలు బయటకి రావాలంటేనే భయపడేలా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు యువకులు అయితే ప్రేమించలేదని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారని ఆడపిల్లలను దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఓ ప్రియుడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేర్చగా.. కొన్ని గంటల్లోనే మరణించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరాదికి ప్రాంతానికి చెందిన పూజా(19) అనే యువతి.. తన బంధువులతో కలిసి తమిళనాడు రాష్ట్రం, తిరుప్పూరు జిల్లా రాయర్ పాళయంలో నివాసం ఉంటుంది. అక్కడే ఓ బనియన్ ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తుండేది. అదే ఫ్యాక్టరీలో రాయర్ పాళయంకు చెందిన గుణశేఖరన్ కుమారుడు లోకేష్(22) కూడా పని చేస్తున్నాడు. అయితే అక్కడ పూజ, లోకేష్ లకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అలా ఈ ఇద్దరు గతకొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నట్లు పోలీసుల విచారణ తేలింది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని పూజతో లోకేష్ తెలిపాడు.
అయితే పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించింది. అంతేకాకా అతడ్ని కొంతకాలంగా తన నుంచి దూరంగా పెడుతుండటంతో లోకేష్ ఉన్నాదిగా మారాడు. బుధవారం సాయంత్రం మాట్లాడాలని పూజాను పనపాళయంకు పిలిపించాడు. పథకం ప్రకారం ముందే తెచ్చుకున్న పెట్రలో తో పూజ కోసం లోకేష్ ఎదురు చూశాడు. ఈక్రమంలో పూజ అక్కడి రావడం.. వారిద్దరి మధ్య మరోసారి చిన్నపాటి వాగ్వాదం జరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లోకేష్.. పూజపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి మోటరు సైకిల్ పై తప్పించుకుని వెళ్లే సమయంలో లోకేష్ జారిపడి పడ్డాడు. ఈక్రమంలోనే పూజా ఒక ప్రాంతాలం కాలిపోతుండటం.. ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో లోకేష్ గాయాలతో పడి ఉండటం స్థానికులు గమనించారు.
యువతికి మంటలు ఆర్పి ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించింది. లోకేష్ కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు తొలుత రెండు వేరు వేరు కారణలతో జరిగిన సంఘటనలు గా భావించారు. చివరకు వారి దర్యాప్తులో పై విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి.. ఇలా నిత్యం ఆడపిల్లలపై దాడులు జరుగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.