నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాల్సిన భార్యాభర్తలు అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాలను నిట్ట నిలువునా చీల్చుకుంటున్నారు. ఇక ఇంతటితో అగుతున్నారా అంటే అదీ లేదు. ఇక పరాయివాడితో పడక సుఖం పంచుకోవాలనే దురుద్దేశంతో చివరికి కట్టుకున్న భర్తను కడతేర్చుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత.. ప్రియుడి కోసం భర్తను దారుణంగా హత్య చేసింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అది ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన శివకుమార్, మాధవి భార్యా భర్తలు. వీరికి గతంలోనే పెళ్లైంది. భర్త శివకుమార్ తాపీ మేస్త్రిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతకాలం వీరి దాంపత్య జీవితం బాగానే సాగుతూ వచ్చింది. కానీ రోజులు మారే కొద్ది భార్య మాధవి బుద్ది వక్రమార్గంలో వెళ్లి పక్కచుపులు చూసింది. అయితే స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో మాధవి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక భర్తకు తెలియకుండా కొన్నాళ్ళ పాటు వీరి చీకటి సంసారం బాగానే సాగింది. సమయమొచినప్పుడల్లా భార్య ప్రియుడితో తిరిగేది. ఇక ఈ క్రమంలోనే భార్య తెర వెనుక సంసారం ఎట్టకేలకు భర్తకు తెలిసింది. దీంతో చాలా సార్లు భార్యపై భర్త చేయి చేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ భార్య భర్త మాటను అస్సలు లెక్కచేయలేదు.
భర్త లేకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చు అనే దురుద్దేశం మాధవికి కలిగింది. ఈ ఆలోచనలను భార్య వెంటనే అమలు చేయాలని పథకం వేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 5న ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఇక ఈ విషయం బయటకు రాకూడదని ఏం తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో విచారించారు. చివరికి శివ కుమార్ ను హత్య చేసింది భార్య మాధవితో పాటు ఆమె ప్రియుడు, మరి కొంతమంది ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.