సాధారణంగా దొంగలు చోరీ చేసే సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు దొంగలు మాత్రం తమ అమాయకత్వంతో అడ్డగా దొరికిపోతుంటారు. అలానే దొంగతనం చేద్దామని ఇద్దరు కేటుగాళ్లు ఓ శివాలయంలోకి చొరబడ్డారు. కానీ ఊహించని విధంగా వారి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. దొంగతనం చేయకుండానే స్థానికులకు అడ్డంగా దొరికిపోయారు. అది కూడా స్థానికులు గుర్తించి పట్టుకోలేదు. ఆ దొంగల అమాయకత్వంతో కాస్త విచిత్రంగా దొరికిపోయారు. అందరికి నవ్వు తెప్పించేలా జరిగిన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మామిడివలసలో జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
శ్రీకాకుళం జిల్లా మామిడివలసలో ఓ పురాతన శివాలయం ఒకటి ఉంది. నిత్యం స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. ఈక్రమంలో ఆ గుడి హుండిలో కానుకలు బాగా వస్తున్నాయి. ఇది గమనించిన ఇద్దరు దొంగలు ఆ దేవాలయంలో చోరి చేసేందుకు ప్రణాళిక వేశారు. ఈక్రమంలోనే ఆ ఇద్దరు దొంగతనం చేసేందుకు శివాలయంలోకి చొరబడ్డారు. ఎవరికి కనిపించకుండా నక్కి,నక్కి దాక్కుంటూ లోపలి వెళ్లారు. అయితే అక్కడ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. వెలుతూరు ఉండటంతో అటుగా ఎవరైన వస్తే దొరికిపోతామని దొంగలు భావించారు. లైట్లు ఆపేస్తే తమ పని సులువుగా జరుగుతుందని అనుకున్నారు. వెంటనే వారి ప్లాన్ ను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా లైట్ స్విచ్ ఆపేద్దామని ఓ దొంగ బోర్డు దగ్గరు వెళ్లాడు. కంగారులో లైట్లు స్వీచ్ బదులు ఢంకా మోగే స్విచ్ నొక్కారు. దీంతో అది కాస్తా గట్టిగా మోగింది.
వెంటనే ఆలయంలో మరొకవైపు నిద్రిస్తున్న విద్యార్థులు ఉలిక్కిపడి లేచారు. విద్యార్ధుల మేల్కోవడం గమనించిన దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోతున్న దొంగలను విద్యార్థులు వెంబడించారు. ఈక్రమంలో ఒక దొంగను పట్టుపడగా..మరొకడు తప్పించుకున్నాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వడంతో గుడి వద్దకు చేరుకుని దొంగను స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి.. ఆ దొంగను అరెస్టు చేశారు. రెండు నెలల క్రితం ఇదే శివాలయంలో దుండగులు హుండీని కాజేశారు. ఇప్పుడు మళ్లీ చోరీ ప్రయత్నం కలకలం రేపింది. అయితే చోరీకి వెళ్లి అమాయకత్వంతో ఢమరుకం మోగే స్విచ్ నొక్కి దొరికిపోయిన దొంగల వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది. దొంగల అమాయకత్వం చూసి స్థానికులు నవ్వుకున్నారు.