ఆ యువతి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. చదువులోనూ బాగా రాణిస్తూ బంధువుల వద్ద మంచి పేరు సంపాదించింది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నానని బయటకు వెళ్లింది. చివరకు..
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణలతో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక చాలా మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యం ఏర్పడి.. జీవితాన్ని అతికష్టం మీద వెళ్లదీస్తున్నారు. ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గురువారం యాదాద్రి జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కార్మికులు మృతి చెందారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో తెలుగు యువత నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు యువత విహార యాత్రలో భాగంగా కర్ణాటక వెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లా కుకునూరు తాలూకా బన్నికొప్ప వీరు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదానికి గురైంది. వీరు కొప్పళ నుంచి గదగ మార్గంలో గోవా వైపు ప్రయాణిస్తుండగా వంతెనను కారు బలంగా ఢీకొట్టింది. అతివేగం కారణంగా వంతెనను ఢీ కొట్టిన కారు నుజ్జు నుజ్జుయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువత దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో షణ్ముఖ్)(28), కె.వెన్నెల వర్ధిని(18), మరో గుర్తుతెలియని యువతి(23), యువకుడు(25)గా గుర్తించారు.
షణ్ముఖ్ హైదరాబాద్ లోని మియాపూర్ లో నివాసం ఉంటున్నారు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కారంచేడు. అక్కడి నుంచి వచ్చి హైదబాద్ లో నివాసం ఉంటున్నారు. షణ్మఖ్ తండ్రి శ్రీరాములు కాంట్రాక్టరు గా పనిచేస్తున్నాడు. ఇతడు ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసి తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. మృతుడికి తల్లి, ఓ సోదరుడు ఉన్నారు. ఇక వెన్నెల విషయానికి వస్తే.. ఈమె హైదరాబాద్ జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో బీఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈమె స్వస్థలం మంచిర్యాల జిల్లా గోదావరిఖనిలోని రమేశ్ నగర్ కాలనీ. స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లేందుకు మియాపూర్ లో ఓ ట్రావెల్స్ కారు అద్దెకు తీసుకున్నారు. విహారయాత్రకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వెన్నెల బయటకు వచ్చింది. యాత్రకు వెళ్లి ఇంటికి సంతోషంగా వస్తుందనుకున్న కూతురు శవంగా రావడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఈక్రమంలోనే వీరందరూ కర్ణాటక రాష్ట్రంలో పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి.. అక్కడి నుంచి గోవాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి.. అతివేగం కారణంగా జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.