సాధారణంగా దొంగలు ఎవరికి దొరక్కుండా చోరీలు చేసేందుకు ప్రణాళికలు వేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి ప్లాన్ లో బెడిసి కొట్టి.. దొరికిపోతుంటారు. ఇలా చోరీలు చేస్తూ దొరికిపోయిన దొంగలను స్థానికులు చితకబాది, పోలీసులకు అప్పగిస్తారు. పోలీసులు సైతం వారిపై కేసు నమోదు చేసి చోరీకి గురైన సొమ్మును, వస్తువులను రీకవరి చేస్తారు. అలానే నేర తీవ్రతను పట్టి వారికి జైలు శిక్షపడేలా చేస్తారు. దొంగలు పట్టుబడినప్పుడు జరిగే అతి సాధారణ విధానం. అయితే కొన్ని చోట్లమాత్రం ఆటవిక న్యాయాన్ని ప్రదర్శిస్తారు. దొంగలకే కాకా సాధారణ ప్రజలకు సైతం భయం కలిగించేలా శిక్షలు విధిస్తుంటారు. చోరీ చేశారని నలుగురు దొంగల చేతులు నరికివేశారు. అది కూడా అందరూ చూస్తుండగా ఆటవిక న్యాయం ప్రదర్శించారు. ఈ దారుణ ఘటన జరిగింది మనదేశంలో కాదులేండి. పొరుగున్న ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల కఠిన నిర్ణయాలకు హద్దు అదుపులేకుండా పోతుంది. ఇప్పటికే మహిళపై దారుణమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా దొంగలపై క్రూరత్వాన్ని ప్రదర్శించారు. కాందహార్ లోని అహ్మద్ షాహీ స్టేడియంలో దొంగతనాలు జరిగాయి. అయితే ఆ చోరీలు, ‘సోడమి’కి పాల్పడిన తొమ్మిది మందిని తాలిబన్లు పట్టుకుని బహిరంగంగా కొరడా దెబ్బలు శిక్షగా వేశారు. ఇక ఈ విషయంపై టోలో న్యూస్ ట్వీట్ ఓ ట్వీట్ చేసింది. “కాందహార్ లోని అహ్మద్ షాహి స్టేడియంలో దోపిడి, సోడమి పాల్పడ్డారనే ఆరోపణలపై తొమ్మిది మందికి శిక్షవిధించారని సుప్రీం కోర్టు ఒక ప్రకటనలో తెలిపింది” అని ఆ ఛానల్ ట్వీట్ చేసింది. నిందితులకు 35 నుంచి 39 కొరడా దెబ్బలను శిక్షగా విధించారని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి హాజీ జైద్ తెలిపారు.
మరొకవైపు తాలిబన్లు నలుగురి చేతులను నరికేశారని తెలుస్తుంది. కాందరహార్ లోని ఫుట్ బాల్ స్టేడియంలో దొంగతనానికి పాల్పడ్డారని నలుగురికి ఈ శిక్ష విధించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ పునరావాస మంత్రి, యూకేలోని శరణార్థుల మంత్రికి మాజీ సలహాదారుడు షబ్మ్ నసిమి తెలిపారు. “ఆఫ్ఘానిస్తాన్ లోని ఫుట్‌బాల్ స్టేడియంలో ఈరోజు తాలిబాన్‌లు దొంగతనానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ నలుగురు వ్యక్తుల చేతులను బహిరంగానే నరికివేశారని ఆమె తెలిపింది. ఇంకా ఆమె ట్విట్ లో అనేక విషయాలు వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో న్యాయమైన విచారణ, సరైన ప్రక్రియ లేకుండా నిందితులను కొరడా దెబ్బలు కొట్టి, నరికివేసి, ఉరి తీస్తున్నారు. ఇక్కడ కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది’ అని షబ్మ్ నసిమి ట్వీట్ చేశారు. మరి.. ఆటవిక చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.