నేటి సమాజంలో ‘ప్రేమ’ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఎందరో యువతులు తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడి.. చివరకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు కేటుగాళ్లు ప్రేమ పేరుతో అమాయకపు ఆడపిల్లలను తమ వలలో వేసుకుంటున్నారు. వారిని శారీరకంగా, ఆర్ధికంగా వాడుకుని వదిలేస్తున్నారు. ఈక్రమంలో కొందరు యువతులు వారిపై పగ తీర్చుకోవడం లేదా తామే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం అనేకం జరుగుతూనే ఉన్నాయి. అయినా కొంతమంది యువతుల్లో మార్పు రావడంలేదు. తల్లిదండ్రులు చేప్పే మాటలను విషంలా.. బయట వారు చేప్పే మాటలు తీపిగా భావించి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రేమ పేరుతో కేటుగాళ్ల చేతిల్లో మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ప్రేమ పేరుతో గర్భందాల్చి..మోసపోయిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీనంగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్ జిల్లా గరుడపేట గ్రామానికి చెందిన ఎర్మ సత్తయ్య, భక్కుబాయి దంపతులకు అంజలి(19) అనే కుమార్తె ఉంది. ఈమె ఇంటర్ పూర్తి చేసి మంచిర్యాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తుంది. అలా ఉద్యోగం చేస్తూ అంజలి.. తన కుటుంబాన్నికి ఆర్ధికంగా చేదోడువాదోడుగా ఉంది. ఈక్రమంలోనే అదే ఆసుపత్రిలో తనతో పాటు లాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న రుద్రాపూర్ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్ల పాటు మంచి స్నేహంగా ఉన్నారు. కొంతకాలానికి వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ యువకుడు అంజలికి ప్రేమ పాఠాలు చెప్పి..తన బుట్టలో వేసుకున్నాడు.
అమాయకురాలైన అంజలి అతడి మాటలు నమ్మి..తన సర్వస్వం అర్పించింది. ఈ క్రమంలోనే వారిద్దరు శారీరంగా కూడా దగ్గరయ్యారు. కొన్ని రోజుల తరువాత అంజలికి ఆరోగ్యపరంగా ఏదో తేడా అనిపించింది. ఆమె పరీక్షలు చేయించుకోగా.. గర్భవతి అని తేలింది. కంగారుపడి ఆ విషయాన్ని ప్రియుడికి తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిని కోరింది. అయితే పెళ్లికి నిరాకరించిన ఆ యువకుడు ముఖం చాటేశాడు. దీంతో ఆ యువకుడి చేతిలో మోసపోయానని గ్రహించిన అంజలి మూడు నెలల క్రితం సొంతురైన గురుడపేటకు వచ్చింది. తల్లిదండ్రులకు తెలిసే లోపు అతడి ఒప్పిందామని అనుకుంది. అన్ని ప్రయాత్నాలు విఫలమైన అంజలి.. మానసికంగా కుంగిపోయింది.
శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులు మందు తాగి.. ఆత్మహత్యకు యత్నిచింది. కుటుంబ సభ్యులు గమనించి కాగజ్ నగర్ మండలంలోని ఈజ్ గామ్ లోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగర్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు గరుడపేటకు చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి.. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.