గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అంధురాలైన యువతిని ఓ యువకుడు దారుణంగా నరికి చంపాడు.
ఈ మధ్యకాలంలో ఆడవారిపై అత్యాచారాలు, వేధింపుల వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అంతేకాక కొందరు గంజాయి మత్తులు అభంశుభం తెలియని పసిపిల్లల నుంచి, పండు ముసలి వారికి వరకు ఎవర్ని వదలిపెట్టకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ అంధురాలిపై అత్యాచారం చేసి దారుణంగా చంపాడు ఓ నరరూప రాక్షసుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లాలో తాడేపల్లిపల్లిలో ఓ దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న రాజు అనే యువకుడు రాణి అనే అంధురాలైన యువతిని దారుణంగా నరికి చంపాడు. ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న రాణినిపై రాజు కన్నేశాడు. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో రాజు ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువతిపై అత్యాచారం చేసి.. ఆ తరువాత కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువతి చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే తీవ్రంగా గాయపడిన రాణి మార్గం మధ్యలోనే మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనపై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడుని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేస్తున్నారు. గంజాయి మత్తులోనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.