దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అలా పూర్వీకుల కాలం నుంచి భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం జరిగిన తరువాత సర్దుకుపోతూ హాయిగా జీవించే వారు. అయితే నేటికాలంలో మాత్రం భార్యభర్తల మధ్య జరుగుతున్న చిన్న పాటి గొడవలు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే భావితరానికి ఆదర్శంగా ఉండాల్సిన వృద్ధ దంపతులు కూడా గొడవలు పడుతున్నారు. చివరకు వారు కూడా హత్యలకు, ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. తాజాగా ఆస్తి కోసం 72 ఏళ్ల భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలోని షాలీమార్ బాగ్ ప్రాంతంలో వృద్ధ దంపతులు వారి పిల్లలతో కలిసి జీవననం సాగిస్తున్నారు. కింద ఫ్లోర్ లో ఈ దంపతులు ఉండగా, పై ఫ్లోర్ లో కుమారుడి కుటుంబం ఉంది. వీరికి మరికొన్ని ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ ఇటీవల ఆ 72 ఏళ్ల వృద్ధుడు ..తన ఆస్తుల్లోని ఓ ఇంటిని అమ్మాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతో మరొక ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే ఆ కొత్త ఇంటిని తన పేరున రిజస్టర్ చేయించుకోలవాని కోరుకుంది. తన కోరికను భర్తకు తెలియజేసింది. అయితే అతడు అందుకు నిరాకరించాడు. కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని కూడా తనపేరునే రిజిస్టర్ చేయించుకున్నాడు ఆ వృద్ధుడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. తనపేరున మార్చాలనే భర్తను ఒత్తిడి చేసింది.
అయితే భార్యపై ఆస్తి రాయడనికి అతడు ససేమిరా అన్నాడు. దీంతో భర్తపై కోపం పెంచుకున్న భార్య దారుణానికి ఒడిగట్టింది. నవంబర్ 21వ తేదీన.. ఆ 70 ఏళ్ల వృద్ధురాలు స్థానికంగా జరిగే తన బంధువుల వివాహానికి హాజరై.. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తన ఇంటికి చేరింది. పెళ్లి నుంచి వచ్చిన తర్వాత కూడా వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం ఆ వృద్ధురాలు పై ఇంట్లో ఉండే.. తన కొడుకు వద్దకు వెళ్లింది. ఆ 72 ఏళ్లు వృద్ధుడు మాత్రం కింద ఇంట్లోనే నిద్రించాడు. భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పింటించింది ఆ వృద్ధురాలు. దీంతో అతను పెద్దగా కేకలు వేశాడు. అతడి అరుపులు విని ఇంట్లో పై ఫ్లోర్ లో ఉన్న కొడుకు, కోడలు కిందకు వచ్చి మంటలు ఆర్పారు.
వెంటనే వృద్ధుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడి శరీరం బాగా కాలినందున మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం అతడి పరిస్థిత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ఆ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించనట్లు ఆమె కుమారుడు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతని భార్యపై.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.