సాధారణంగా పాము పేరు వినగానే అందరికి భయమేస్తుంది. కారణం అది కాటేస్తే ప్రాణాలు పోతాయని భయం. దీంతో పాటు పాము పగబడుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవి పగబడితే చంపేవరకు విడిచి పెట్టవని కొందరి అభిప్రాయం. ఆ వార్తలు నిజమో, అబద్ధమో ప్రక్కన పెడితే.. మాటలు నిజమనేల కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఓ కుటుంబంలోని సభ్యులను 45 రోజుల వ్యవధిలో ఆరు సార్లు పాముు కాటేసింది. ఈ విషయం ఇప్పుడు ఆ చుట్టు పక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి ఆది ఆంధ్రవాడకు చెందిన వెంకటేష్, భార్య వెంటకమ్మ అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి జగదీష్ అనే కుమారుడు ఉన్నాడు. శనివారం రాత్రి జగదీష్ ఆరుబయట నిద్రిస్తుండగా అతడి కాలుపై పాము కాటేసింది. దీంతో అతడిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.దీంతో పాము నుంచి తమ ప్రాణాలకు ముప్పుదని, రక్షణ కలిపించాలని వెంకటేష్ కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. కచ్చితంగా ఆ పాము తమని కాటేసి చంపేస్తుందని వాపోతున్నారు. వారు అలా అనటానికి బలమైన కారణం కూడా ఉంది.
అది ఏమిటంటే.. వెంకటేష్ కు గతంలో రెండు సార్లు, అతడి తండ్రి, భార్యను, కుమారుడిని ఒక్కొక్కసారి పాము కాటేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి వెంకటేష్ కుమారుడు పాము కాటేసింది. దీంతో తమ కుటుంబాన్ని పాము వేధిస్తున్నాదని భయాందోళనకు గురవుతున్నారు. వీరితో పాటు చుట్టుపక్కల వారు కూడా ఆరుబయట పడుకున్న వారి కుటుంబలోని వారినే పాము కాటేస్తుందు. దీంతో పాము పగబట్టిందని గ్రామస్తులు చెప్పుకొంటున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.