ప్రేమ పేరుతో యువతులు నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు మాత్రం ఆగటం లేదు. ఇంట్లో వారికి చెప్పుకోలేక, తమలో తమలో తామే మానసికంగా కుంగిపోతున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా మరో 24 గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి.. ప్రేమ పేరుతే యువకుడి వేధింపులు తట్టుకోలేక పాడే ఎక్కింది. ఈఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
తెలంగాణలోని నారాయణపేట జిల్లా చందాపుర్ కు చెందిన పద్మమ్మ, వెంటకయ్య దంపతుల రెండో కుమార్తె భీమేశ్వరి(19). ఆమెకు దండు గ్రామానికి చెందిన యువకుడితో వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. పది రోజుల కిందట వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. సోమవారం తెల్లవారుజామున పందిరి వేసేందుకు కుటుంబ సభ్యులు నిద్రలేచారు. ఇంటిలోకి వెళ్లి చూడగా భీమేశ్వరి ఇంట్లోని వెంటిలేటర్ కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఆమె దగ్గర ఓ సూసైట్ లేఖను కుటుంబ సభ్యులు గుర్తించారు. చందాపూర్ కు చెందిన నర్సింహులు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అది భరించలేక ఆత్మహత్య పాల్పడుతున్నట్లు ఆ లేఖలో ఉంది. యువకుడు వేధిస్తున్నట్లు తమతో చెబితే పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవారమని కుటుంబ సభ్యులు విలపించారు. భీమేశ్వరి కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.