నేటికాలంలో రోజు రోజుకు ఆడపిల్లలకు రక్షణ లేకుండపోయింది. ఒంటరిగా ఎక్కడికి వెళ్లిన ఇంటికి వచ్చే వరకు భయం భయంగానే గడుపుతారు. ఎంతో జాగ్రత్తగా ఉంటున్న.. అక్కడక్కడ మానవ రూపంలో ఉన్న మృగాల కాపు కాసి.. వేధింపులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో జాతర కు వచ్చిన ఇద్దరు యువతులపై కొందరు యువకులు నడిరోడ్డు మీద లైంగిక దాడికి పాల్పడారు. పక్కన ఉన్నవారు కాపాడాల్సింది పోయి విజిల్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలిరాజ్ పూర్ జిల్లాలోని సోండ్వా తెహసీల్ ప్రాంతంలోని వాల్పూర్ గ్రామంలో జాతర జరిగింది. గిరిజనులు నివాసం ఉండే ప్రాంతంలో ఈ జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. వాల్పూర్ గ్రామంలోని జాతరను తిలకించేందుకు పక్క గ్రామాల నుంచి చాలామంది జనం వచ్చారు. ఇదే సమయంలో జాతరకు వచ్చిన ఇద్దరు గిరిజన యువతలపై కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగ కొద్ది సమయానికి నడి రోడు మీద ఆ ఇద్దరు యువతులపై లైంగిక దాడి చేశారు.
అందరు చూస్తుండగానే నడి రోడుపై ఆ యువతులను గట్టిగా కౌగిలించుకోవడం. వారికి ముద్దులు పెట్టడం వంటివి చేశారు. వారి వేధింపులను ఆపకుండా మరికొందరు కేరింతలతో ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ స్పందించారు. నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. మరి ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
⚡️Distressing Video
A tribal woman molested in broad daylight by saffron-clad goons during a fair in Madhya Pradesh, India.pic.twitter.com/lTZKLxVVwF
— Ahmer Khan (@ahmermkhan) March 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.