నేటికాలంలో మాయ మాటలు చెప్పి అమ్మాయిలను లోబర్చుకునే మాయగాళ్లు ఎక్కువయ్యారు. కొందరు యువతులు కూడా ఆ కేటుగాళ్లను గుడ్డిగా నమ్మి తరువాత కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువకుడు ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. చివరికి ఆ బాలికను పూర్తిగా లోబర్చుకున్నాడు. అంతటితో ఆగక తన ముగ్గురు స్నేహితులను పిలిచి.. బాలికపై అత్యాచారానికి పాల్పపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో చేటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన వసంత్ గిరీష్ అనే యువకుడు స్థానికంగా ఓ కాలేజిలో డెంటల్ చదువుతున్నాడు. అక్కడే స్థానికంగా నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికపై కన్నేశాడు వసంత్ గిరీష్. ఆ బాలిక తన బామ్మతో పాటు ఉంటూ స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మైనర్ బాలిక పాఠశాల వెళ్లేటప్పుడు, వసంత్ ప్రతి రోజు అనుసరించేవాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అతను చెబుతున్న మాయ మాటలను మైనర్ బాలిక పూర్తిగా నమ్మేసింది.
ఆ బాలిక ఇక ప్రతి రోజు బామ్మ పడుకోగానే మెల్లగా అతని ఇంటికి వెళ్లేది. అతడు గంజాయి సేవించి.. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బాలికను వాళ్లింటి వద్ద దిగపెట్టేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బాలిక కూడా అతనికి సహకరించేది. దీంతో మరింత రెచ్చిపోయిన అతను ఒక రోజు తన స్నేహితులను తన ఇంటికి రమ్మని పిలిచాడు. అందరు కలిసి గంజాయి తీసుకున్నారు.
ఈ క్రమంలో ఎప్పటిలాగే బాలిక అతడి ఇంటికి వచ్చి వారి మధ్య చిక్కుకుంది. ఆ రోజు వారంతా కలిసి.. బాలికను ఒకరి తర్వాత మరొకరు బలవంతంగా అనుభవించారు. అనంతరం పాఠశాలకు వెళ్లిన బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన ఉపాధ్యాయులు బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో బాలిక తల్లిదండ్రులు గట్టిగా అడగ్గానే జరిగిన దారుణాన్ని తెలిపింది. దీంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారుణానికి ఒడిగట్టిన వసంత్ గిరీష్, రెజిత్, ప్రసన్న, విశాల్ గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో రెజిత్ అనే యువకుడు వర్ధమాన నటుడు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి