‘అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది’ అనే సామెత విన్నారు కదా. అది ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి బాగా నప్పుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుని బరాత్ అయ్యాక ఇంట్లో అడుగుపెట్టే సమయంలో.. పోలీసులు వచ్చి సినిమాటిక్ స్టైల్ లో ‘యు ఆర్ అండర్ అరెస్ట్’ అనే సరికి అందరూ అవాక్కయ్యారు. అది కూడా మామూలు కేసు కాదు. అత్యాచారం కేసు కింద అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జష్ పూర్ తప్కారా పోలీసు స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. ఓ యువకుడు పెళ్లి చేసుకుని ఘనంగా ఊరేగింపుగా ఇంటికి వచ్చాడు. కానీ, అతడికి గుమ్మంలో ఊహించని షాక్ తగిలింది. ఇంట్లోకి ఆహ్వానించేందుకు అతడికి గుమ్మంలో హారతి ప్లేటు కనిపించలేదు. దాని స్థానంలో బేడీలు పట్టుకున్న పోలీసులు కనిపించారు. విషయం అర్థంకాక పోయినా అలాగే వెళ్లాడు. అతడిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు? నేను ఏం చేశాను? అంటూ నూతన వరుడు ప్రశ్నించగా.. పోలీసులు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. అత్యాచారం కేసు కింద అతడిని అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆ యువకుడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటల చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమెను తన కోరికలు తీర్చుకునే వస్తువులా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత ఆమె గర్భవతి అయ్యిందని.. ఆమెకు మందు పెట్టి అబార్షన్ చేయించాడని.. దాంతో వీక్ మారిన తనను అతను వదిలించుకున్నాడని తెలిపింది. ఆ తర్వాత మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ యువకుడిపై బాధితురాలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: భర్తతో పనేంటి.. ప్రియుడు ఉండగా? బరి తెగించిన భార్య!
యువతి ఫిర్యాదుతో ఐపీసీ 376(2)(n), 312, 3(2-5) అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లైన రోజు తొలిరాత్రి వేడుక జరుపుకోవాల్సిన ఆ యువకుడు అతడి బుద్ధితో ఆ రాత్రిని స్టేషన్ లో గడపాల్సి వచ్చింది. అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక.. శిక్ష కూడా ఏళ్లలో పడే అవకాశం ఉంటుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.