ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని విన్నాం. కానీ, అక్రమ సంబంధం/వివాహేతర సంబంధానికి కూడా అదే రూలా? ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన వింటే మీకు కూడా అదే అనుమానం కలిగే అవకాశం ఉందిలెండి. తల్లిదండ్రులు లేని పిల్లాడు.. పెదనాన్న చేరదీశాడు. బుద్ధిగా ఉండక పిన్నిపై కన్నేశాడు. పిన్నితో చేయకూడని పనులు చేశాడు. అది తెలుసుకున్న బాబాయిలు ఆ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. మర్మాంగంపై వాతలు పెట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఏపీలో జరిగింది. ఓ బాలుడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి పెదనాన్న వాళ్ల దగ్గర పెరుగుతున్నాడు. వరుసకు పిన్న బాబాయి అయ్యే వాళ్ల ఇంటికి కూడా తరచూ వెళ్తుండేవాడు. మొదట ఎవరికీ అనుమానం రాలేదు. కానీ, ఓ రోజు తన బాబాయి మరో వ్యక్తి ఆ బాలుడిపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. తొడ, మర్మాంగంపై వాతలు పెట్టి వార్నింగ్ ఇచ్చారు. అతని పరిస్థితి బాగోలేక ఆస్పత్రిలో చేర్పించారు. ఆ విషయం అడిగేందుకు వెళ్లిన బాలుడి పెదనాన్నపై కూడా దాడి చేసినట్లు సమాచారం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని నిలదీయగా అసలు విషయం బయట పడింది.
ఆ బాలుడు, తన పిన్ని ఇద్దరూ వావి వరసలు మరిచి తప్పుడు పనులు చేస్తున్నట్లు తెలిపారు. 17 ఏళ్ల బాలుడు తన పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయం వెలుగు చూసింది. తల్లిదండ్రులు లేని పిల్లాడని చేరదీసిన వాళ్లనే ఇలా చేస్తాడా అంటూ స్థానికులు షాకయ్యారు. మరోవైపు తెలిసీ తెలియని వయసులో పిల్లాడు అలా ప్రవర్తిస్తే.. బుద్ధి చెప్పాల్సిన స్థానంలో ఉన్న పిన్ని అతనితో పక్క పంచుకోవడంపై పెదవి విరుస్తున్నారు. పిల్లాడి బుద్ధి గడ్డి తినింది సరే.. ఆ పిన్ని బుద్ధి ఏ గాడిదలు కాస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో అసలు శిక్ష ఎవరికి పడాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.