మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ జిల్లాలో ఓ మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే గత ఏప్రిల్ నుంచి ఆ యువతికి ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం అలా సాగుతూ ఉంది.
ఇక వీరిద్దరూ కొన్నాళ్ల పాటు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ మొదటి వారంలో ఆ యువకుడు మా సోదరుడి పుట్టిన రోజు ఉందని రావాలంటూ నమ్మించాడు. ఇక కాదనకుండా ఆ యువతి వెళ్లింది. ఇక వెళ్లిన అనంతరం అతడు ఓ రూంలోకి తీసుకెళ్లాడు. ఇక వెంటనే ఆ యువకుడు తన ఫ్రెండ్స్ ని పిలుపించుకుని ఆ మహిళా కానిస్టేబుల్ పై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో కూడా తీశారు.
ఇక మేల్కొన్న బాధితురాలు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు ప్రధాన నిందితుడి తల్లిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఏకంగా ఓ మహిళా కానిస్టేబుల్ పై చేసిన ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.