అతనికి పెళ్లై పిల్లలు ఉన్నారు. బాగా చదువుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. ఇక తన జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఓ లేడీ టీచర్ పై మనసు పడ్డాడు. మస్టారు ప్రేమకు ఆమెకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి ప్రేమాయణం అలా కొనసాగుతూ వచ్చింది. కట్ చేస్తే అదే స్కూల్ లో టీచర్ గా ఉన్న మరొకరితో ఆ లేడీ టీచర్ అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం మొదటి ప్రియుడికి తెలియడంతో సీన్ రివర్స్ అయింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగింది? ఆ తర్వాత మొదటి ప్రియుడు ఏం చేశాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని గదగ్ జిల్లా నరుంద పరిధిలోని హద్లీ ప్రాంతం. ఇక్కడే ముత్తప్ప అనే వ్యక్తి టీచర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. మంచి జీతం, కోరుకున్న ఉద్యోగం ఉండడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అతని జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే గత కొన్ని రోజుల కిందట ముత్తప్ప పని చేస్తున్న స్కల్ లోకి ఓ మహిళ పార్ట్ టైమ్ టీచర్ గా చేరింది. పాఠశాలలో చేరిన నాటి నుంచి ముత్తప్ప ఆ మహిళపై మనసు పడ్డాడు. ఆమెకు పెళ్లై ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ ముత్తప్పతో ప్రేమాయణానికి తెర తేపింది. దీంతో ఇద్దరూ కొన్ని రోజుల పాటు తెర వెనుక ప్రేమాయణాన్ని నడిపిస్తూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు.
అలా కొంత కాలం తర్వాత ఆ మహిళ టీచర్ అదే స్కూల్ లో పని చేస్తున్న మరో టీచర్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయాన్ని ముత్తప్పకు తెలియకుండా ఆ మహిళ టీచర్ సీక్రెట్ గా మెయింటెన్ చేసింది. కానీ ఎట్టకేలకు ఆ మహిళ టీచర్ సాగించిన వివాహేతర సంబంధం మొదటి ప్రియుడు ముత్తప్పకు తెలిసిపోయింది. దీంతో ముత్తప్ప ఈ విషయం తెలుసుకుని ఒంటికాలుపై లేచాడు. ఈ క్రమంలోనే కోపాన్ని ఆపుకోలేక తన ప్రియురాలి కుటుంబం మొత్తాన్ని చంపాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ముత్తప్ప ఇటీవల ప్రియురాలి కుమారుడి బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. అనంతరం అతని రెండో ప్రియుడుని, ప్రియురాలిపై సైతం ముత్తప్ప దాడి చేశాడు. ఈ దాడిలో ఆ లేడీ టీచర్ కుమారుడు చనిపోగా, ఇద్దరి తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు ముత్తప్పను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#Gadag police arrest the teacher who had killed a 4th std student by throwing him to death from the first floor of the school. Police said that the teacher was angry on boy’s mother, another teacher in the school @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @raghukoppar pic.twitter.com/gT9GY0rEJl
— Amit Upadhye (@Amitsen_TNIE) December 20, 2022