వీళ్లిద్దరూ ప్రేమికులు.. గత మూడేళ్ల పాటు ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కట్ చేస్తే.. అనుకోని ఘటనతో వీరి లవ్ స్టోరీ ఊహించిన మలుపుకు తిరిగింది. అసలేం జరిగిందంటే?
ప్రేమ పేరుతో దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమించిన వాళ్లు మోసం చేశారని, గర్భవతిని చేసి పెళ్లికి నో చెప్పాడానే కారణాలతో చివరికి దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు మన దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
అది తమిళనాడులోని విళుపురం జిల్లా రాధాపురం గ్రామం. ఇక్కడే ధరణి (20) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది. అయితే ఈ యువతి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో నర్సింగ్ చదివేది. ఇక ఆ యువతి రోజు కాలేజీకి వెళ్తూ, వస్తూ ఉన్న క్రమంలోనే ఈమెకు గణేశన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ 3 ఏళ్లపాటు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ హత్యకేసులో భాగంగా గణేశన్ నిందితుడుగా ఉన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు ధరణి.. గణేశన్ నుంచి దూరం జరగాలని అనుకుంది. ఈ క్రమంలోనే గతం కొంత కాలం నుంచి ధరణి అతనితో మాట్లాడడమే మానేసింది. దీంతో గణేశన్ ఆ యువతిపై కోపంతో ఊగిపోయాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి. పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు నన్ను దూరం పెడుతున్న ప్రియురాలిని ఎలాగైన హత్య చేయాలని అనుకున్నాడు. ఇక ఇందులో భాగంగానే గణేశన్ ఇటీవల అందరూ చూస్తుండగానే ధరణి గొంతు కోసం అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో ఆ యువతి రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న ధరణి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే ఇది వరకే గణేశన్ మీద హత్య కేసు నమోదవ్వడంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అందరి ముందే ప్రియురాలిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాదిపై ఘాతుకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.