ఆ కుర్రాడికి వారి బంధువుల్లోని ఓ మహిళ అంటే మోజు. ఆమె ఆ యువకుడి ఇంటికొచ్చినా, ఇతగాడు వాళ్లింటికి వెళ్లినా ప్రతీసారి ఆమె వంక ఏదో రకంగా చూస్తూ ఉండేవాడు. అలా ఆమెపై మెల్లగా కన్నేశాడు. ఎప్పటికైన ఆ మహిళను లోబరుచుకుని కోరికలు తీర్చుకోవాలని తహతహలాడేవాడు. ఇక ఆ మహిళను చూసిన ప్రతీసారి మనోడు ఏదో ఫీలింగ్ లో తేలియాడుతూ విషపు ఆలోచనల్లో మునిగిపోయేవాడు. ఇకపోతే ఇటీవల ఆ యువకుడు భర్త లేని సమయంలో ఆ మహిళ ఇంట్లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది తమిళనాడులోని రాంపూర్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో ఇతని బంధువులైన ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే ఆ యువకుడు మాత్రం ఆ మహిళపై కన్నేశాడు. ఆమెపై ఇష్టమో, వ్యామోహమో తెలియదు కానీ, ఆమెను చూసిన ప్రతీసారి విషపు ఆలోచనలు నింపుకునేవాడు. ఎలాగైన ఆ మహిళతో కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇక ఆ యువకుడు పథకం ప్రకారం.. భర్త లేని సమయంలో ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అంకుల్ లేడా అని ఆ మహిళతో మెల్లగా మాటలు కలిపాడు. బంధువుల కుర్రాడు కావడంతో ఆ మహిళ కిచెన్ లోకి వెళ్లి టీ తీసుకొచ్చి ఆ యువకుడి చేతికి ఇచ్చింది.
దీంతో ఆ యువకుడు టీ తాగే క్రమంలో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ సమయంలోనే ఆ మహిళ బెడ్ రూంలోకి వెళ్లింది. ఇదే మంచి సమయం అనుకున్న ఆ కుర్రాడు.. ఆ మహిళ బెడ్ రూంలోకి వెళ్లింది చూసి ఆమె వెంటే వెళ్లాడు. మెల్లగా వెనకాల నుంచి ఆమెను కౌగిలించుకుని ఏదేదో చేయసాగాడు. దీనిని పసిగట్టిన ఆ మహిళ ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీసే ప్రయత్నం చేసింది. కానీ మనోడు మందు జాగ్రత్తతో తలుపులు పెట్టాడు. అనంతరం ఆ యవకుడు ఆ మహిళపై బలవంతంగా అత్యాచారం చేసి ఇన్నాళ్ల కోరికను మొత్తం తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికైన చెబితే నీ భర్తను చంపుతానని వార్నింగ్ కూడా ఇచ్చాడు.
దీంతో భయపడిపోయిన ఆ మహిళ కొన్నాళ్ల పాటు ఎవరికీ చెప్పలేదు. కొంత కాలం పాటు ఆ యవకుడు చేసిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆ మహిళ తరుచు బాధపడుతూ ఉండేది. ఇలా అయితే కాదని భావించిన ఆ మహిళ ఇటీవల ఆ యువకుడి దారుణాన్ని భర్తతో పాటు ఆమె బంధువులకు తెలిపింది. అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త, భార్యతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.