తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య అని చూడకుండా భర్త బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు. వరకట్నం వేధింపులతో తరుచు భార్యను వేధిస్తూ చుక్కలు చూపించాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆమెపై విచక్షణ రహితంగా దాడులకు కూడా పాల్పడ్డాడు. భర్త టార్చర్ ను భరించలేని ఆ వివాహిత ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
తమిళనాడు విల్లుపురం జిల్లా సెంజి పరిధిలోని కిలిపెన్నూత్తూరు అబ్దుల్లా, ఫిర్దోస్ (22) దంపతులు నివాసం ఉంటున్నారు. గతేడాది ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. అయితే భర్త అబ్దుల్లా తిరువణ్ణామలైలోని ఓ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీతో అబ్దుల్లా, ఫిర్దోస్ దంపతుల కాపురం కొంత కాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ దంపతులకు ఓ బిడ్డ కూడా జన్మించింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త అబ్దుల్లా తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తుంది.
ఇక భర్త టార్చర్ ను భరించలేని ఆ భార్య ఈ నెల 17న తన పుట్టింటికి వెళ్లింది. ఇక భార్య పుట్టింటికి వెళ్లాక కూడా భర్త వేధించినట్లు సమాచారం. ఇక ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో తెలియదు కానీ.. ఫిర్దోస్ మరుసటి రోజు సాయంత్రం స్థానికంగా ఉండే ఓ బావిలో తన 50 రోజుల పసిబిడ్డతో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఫిర్దోస్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులకు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరకట్నం వేధింపుల కారణంగానే ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు మృతురాలి భర్తను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.