భార్యపై అనుమానంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, ఆ తర్వాత భార్య శవాన్ని ఫొటో తీసుకుని ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ, ఇంతదానికే కొందరు భర్తలు ఊహించని దారుణాలకు పాల్పడుతూ అన్యాయంగా భార్యల ప్రాణాలు తీస్తున్నారు. దీంతో పాటు భార్యకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టి అనుమానంతో వేధిస్తున్నారు. ఇంతటితో సరిపెట్టకుండా.. హత్యలకు కూడా కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త.. భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య శవంతో వీడియో తీసుకుని ఫేస్ బుక్ లో స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. అది తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఎర్రభయ్యనహళ్లి గ్రామం. ఇక్కడే మునిరాజు-లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి భర్త మునిరాజు భార్య లక్ష్మిని అనుమానించడం మొదలు పెట్టాడు. తరుచు వేధిస్తూ తీవ్ర హింసలకు గురి చేశాడు. అయితే భర్త వేధింపులను భార్య కొన్నాళ్ల పాటు భరిస్తూ వచ్చింది.
ఇలా రోజూ.. నీకు పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో వేధించేవాడు. అయితే.. ఇటీవల ఇదే అంశంపై భర్త మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త మునిరాజు.. క్షణికావేశంలో భార్యను ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. భర్త దాడిలో రక్తపు మడుగులో పడి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భార్య శవాన్ని వీడియో తీసుకుని భర్త తన ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టాడు.
ఆ తర్వాత మునిరాజు కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనుమానంతో భార్య ప్రాణాలు తీసి, తానూ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.