ఆమెకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. అలా వీరి కాపురం ఆనందంగా సాగుతున్న క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు భగ్గుమన్నాయి. దీంతో భార్యతో ఉండలేని భర్త భార్యను వదిలి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ మరో వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అతనితో కూడా బాగానే మెలిగింది. ఈ క్రమంలోనే భార్యపై రెండవ భర్తకు అనుమానం కలిగింది. ఇదే విషయమై భర్త భార్యతో గొడవపడ్డాడు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన భర్త భార్య గర్భిణీ అని చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది తమిళనాడు విలుప్పురం జిల్లా కండాచ్చిపురం పరిధిలోని వీరంగిపురం గ్రామం. ఇక్కడే భారతి, ఈశ్వరన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భారతితో ఉండలేని భర్త ఈశ్వరన్ భార్యను వదిలి వెళ్లిపోయాడు. అలా కొన్ని నెలలు తర్వాత విలుప్పురం జిల్లాకు చెందిన గుణవన్ అనే వ్యక్తితో భారతి పరిచయం పెంచుకుంది. ఈ పరిచయమే రాను రాను ఇద్దరి విడిచి ఉండలేనంతగా మారిపోయారు. అలా కొన్ని రోజుల తర్వాత భారతి గుణవన్ రెండవ వివాహం చేసుకుంది.
గుణవన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత భారతి రెండవ భర్తతో కాపురం బాగానే చేసింది. ఈ క్రమంలోనే భర్త గుణవన్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. నీకు పరాయి మగాళ్లతో సంబంధాలు ఉన్నాయంటూ రోజూ వేధించేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరిగేవి. అయితే భార్యాభర్తలు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త గుణవన్.. భారతి 4 నెలల గర్భిణీ అని చూడకుండా ఆమెపై ఇష్టమొచ్చిన రీతిలో దాడి చేశాడు. భర్త దాడిలో భారతి రక్తపు మడుగులో పడి ఏడుస్తూ ఉంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే భారతిని ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ చివరికి భారతి ప్రాణాలు విడిచింది. కూతురు మరణవార్త తెలుసుకున్న భారతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం భర్త గుణవన్ పై భారతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.