కామంతో రెచ్చిపోతున్న కొందరు కేటుగాళ్లు బాలికలపై కనికరం లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఓ 15 ఏళ్ల బాలికపై మామ విర్రవీగి ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక అత్త కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెచ్చిపోయి 10 మందితో సామూహిక అత్యాచారం చేయించాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని విల్లుపురం పరిధిలోని విక్రంవాడి ప్రాంతం. ఓ 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల వద్ద ఉంటూ 10వ తరగతి చదువుతోంది. అయితే వరసకు మామ అయ్యే పెళ్లైన వ్యక్తి ఆ బాలికపై కన్నేశాడు.
ఇది కూడా చదవండి: పక్కింటి యువకుడితో పిల్లల తల్లి ప్రేమాయణం.. భర్త లేని సమయం చూసి!
ఎలాగైన లొంగదీసుకోవాలని భావించి మామమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య కూడా సైలెంట్ అయి అతని దారుణానికి వత్తాసు పలికింది. దీంతో రెచ్చిపోయిన ఆ కామాందుడు ఏకంగా 10 మంది యువకులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఆ బాలిక ఆరోగ్య పరిస్థితులలో మార్పులు గమనించిన స్కూల్ టీచర్స్ తల్లిదండ్రులకు వివరించారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఇంతటి దారుణానికి పాల్పడ్డ మామ, అత్తతో పాటు 10 మంది నిందితులపై కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.