ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు జన్మించారు. గత రెండేళ్ల కాలంలో మరో ఇద్దరు పిల్లలు జన్మించారు. కానీ, ఆ పిల్లలను పోషించలేక ఈ ఇల్లాలు పుట్టిన పిల్లలను పుట్టినట్టే ఫ్రీజర్ లో దాచి పెట్టింది.
పెళ్లైన చాలా మంది దంపతులకు పిల్లలు కలగడం లేదు. దీంతో ఎంతో మంది డాక్టర్లను సంప్రదిస్తూ ఎందరో దేవుళ్లకు మొక్కుతున్నారు. అయినా వాళ్లకు పిల్లలు మాత్రం కలగడం లేదు. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురై చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ, ఓ తల్లి మాత్రం.. పుట్టిన పిల్లలను పోషించలేక దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దక్షణి కొరియా సిరియా పరిధిలోని సువాల్ ప్రాంతంలో ఓ మహిళ (30) నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహ జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు.
గత కొన్నేళ్ల నుంచి వీరి ఆర్థిక పరిస్థితి బాగా లేనట్లుగా తెలుస్తుంది. అయితే, 2018లో ఈ మహిళ గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత ఈ మహిళ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిందని సంతోషపడాల్సిన ఈ దుర్మార్గురాలు.. ఆ బిడ్డను చంపాలని అనుకుంది. ఇక తన భర్తకు తెలియకుండా ఆ పసి బిడ్డను గొంతు పిసికి చంపి ఇంట్లోని ప్రీజర్ లో దాచి పెట్టింది. కట్ చేస్తే.. మరో ఏడాది తర్వాత ఈ మహిళ ఈ సారి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయినా ఈ ఇల్లాలు సంతోష పడలేదు. పుట్టిన మరుసటి రోజే ఆ మగబిడ్డను సైతం చంపి భర్తకు అనుమానం రాకుండా ఇంట్లో ఉన్న ఫ్రీజర్ లో దాచి పెట్టింది. ఈ విషయాన్ని ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది.
ఇకపోతే, ఆమె ప్రసవించిన ఆస్పత్రిలోని వైద్యులు ఆడిట్ నిర్వాహించారు. ఈ మహిళ 5 మందికి జన్మనిచ్చిందని రికార్డుల్లో ఉంది. అధికారులు ఆమె ఇంటికి వచ్చి చూడగా.. ఆ మహిళ వద్ద ముగ్గురు పిల్లలు మాత్రమే కనిపించారు. మిగతా పిల్లలు ఎక్కడ అని ఆమెను ప్రశ్నించగా.. నేను అబార్షన్ చేయించుకున్నానని భర్తకు చెప్పి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ మహిళ ప్రవర్తనతో ఆ ఆస్పత్రి వైద్యులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపెట్టి చివరికి నేరాన్ని అంగీకరించింది. పుట్టిన పిల్లలను పోషించలేక ఇద్దరు పిల్లలను గొంతు పిసికి హత్య చేసి ఫ్రీజర్ లో దాచి పెట్టానని తెలిపింది. ఆ మహిళ మాటలను విన్న ఆమె భర్త, అధికారులు, పోలీసులు అంతా షాక్ గురయ్యారు. దీంతో పోలీసులు శుక్రవారం ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.