ప్రేమికులు అన్నాక గొడవలు జరగడం కామన్. రాత్రి తిట్టుకుని తెల్లారేసరికి మాట్లాడుకుంటారు. ఇక అదే గొడవ పతాకస్థాయికి చేరితే మనస్పర్ధలతో చివరికి బ్రేకప్ ల వరకు వెళ్తుంటారు. అయితే ఇలాంటి మనస్పర్థలతో ఓ యువకుడు తన ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడు. అప్పటి నుంచి తన మాజీ ప్రియురాలిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైన సరే తన పగని తీర్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు.
అయితే ఓ చోట మాజీ ప్రియురాలి రాకను గమనించిన ప్రియుడు ఆమె తెచ్చుకున్న కాస్లీ హ్యాండ్ బ్యాగ్ లో ఆమెకు తెలియకుండా మూత్రం పోశాడు. బ్యాగ్ నుంచి వాసన బయటకు రాకుండా సువాసన వచ్చే స్ప్రే కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత తన బ్యాగులో మూత్రం ఉందని ఆ యువతి గ్రహించింది. పక్కా ఇది మాజీ ప్రియుడి పనేనంటూ తెలుసుకున్న ఆ ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించారు. ఇతగాడు మాత్రం ఈ పని నేను చేయలేదంటూ తప్పించుకునే ప్రయత్నాలు ఎన్నో చేశాడు.
ఇక చేసేదేంలేక పోలీసులు ఆ బ్యాగ్ ను ల్యాబ్ కు టెస్ట్ కు పంపగా మూత్రం పోసింది అతడేనంటూ తేలింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు బాధితురాలికి న్యాయం చేస్తూ నిందితుడికి 1150 డాలర్ల.., అంటే మన కరెన్సీలో రూ. 91 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. గతేడాది దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.