Software Engineer: గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ప్లాట్‌లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని మరణించింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన కృతి సంబ్యాల్ గచ్చిబౌలిలోని అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నానక్‌రాంగూడలోని సాగర్ గార్డినియా అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. రెండు రోజుల క్రితం ఓ స్నేహితురాలు ఢిల్లీ వెళ్లిపోయింది. బుధవారం మరో స్నేహితురాలు ఆఫీసుకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాట్లో ఒంటరిగా ఉన్న కృతి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది.
స్నేహితుడైన సచిన్ అనే వ్యక్తికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ చేసింది. అతడు రూమ్‌కు వచ్చేసరికి ఆమె విగత జీవిగా.. ఉరికి వేళాడుతూ కనిపించింది. దీంతో వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ద్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bihar: నీతో కాపురం చేయనంటూ పోలీస్ భర్తకు తెగేసి చెప్పిన భార్య.. మనోడు ఏం చేశాడో తెలుసా!