పెళ్లి కొంత మందికి తీపి అనుభవాలు పంచుతుంటే.. కొందరి జీవితాలను కకావికలం చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు. పెళ్లికి ముందు ప్రేమ లేదా కాబోయే భర్తకు సంబంధించిన కలలు కనడం.. ఆ తర్వాత ఆ కలలు కల్లలు అయ్యాయని చింతిస్తుంటారు.
పెళ్లి కొంత మందికి తీపి అనుభవాలు పంచుతుంటే.. కొందరి జీవితాలను కకావికలం చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు. పెళ్లికి ముందు ప్రేమ లేదా కాబోయే భర్తకు సంబంధించిన కలలు కనడం.. ఆ తర్వాత ఆ కలలు కల్లలు అయ్యాయని చింతించడం, ఆ తర్వాత సర్ధుకుపోయి జీవించేస్తున్నారు 90 శాతం మంది మహిళలు. కానీ మిగిలిన 10 శాతం మంది మహిళలు మాత్రం.. భర్తలతో ఉండలేక లేదా అటు ప్రియుడ్ని విడిచిపెట్టి ఉండలేక పెళ్లి తర్వాత దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు లబోదిబో మంటూ బాధపడుతున్నారు. తల్లి కళ్లు కప్పి కొత్త గా పెళ్లైన వధువు పరారైన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కర్నాటక బీదర్‌కు చెందిన పార్వతి.. తన ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి వలస వచ్చి హైదరాబాద్‌లోని గోపన్ తల్లి తండాలో నివాసం ఉంటుంది. ఆమె పెద్ద కూతురు జగ్దేవికి ఔరత్‌కు చెందిన పవార్ అనే యువకుడితో మే నెల 29న వివాహం అయ్యింది. అనంతరం అత్తారింటికి కాపురానికి వెళ్లింది. అంతలో పుట్టింటికి వచ్చింది జగ్దేవి. గత నెల 29న సాయంత్రం తల్లి, కూతుళ్లు బయటకు వెళ్లారు. అయితే ఏదో కావాలంటూ తల్లి కళ్లు గప్పి వెళ్లిన కూతరు ఇక కనిపించలేదు. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమా లేక వివాహ బంధంలో గొడవలా అనే కోణంలో విచారిస్తున్నారు.