మధుప్రియ – పరిచయం అక్కర లేని పేరు..తెలంగాణ పాటకు పర్యాయపదంలాంటి పేరు. తన నోటి వెంట పాట పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది .ప్రతీ గుండె గొంతుకను స్పృశిస్తుంది. పిల్లనమ్మా అంటూ తొమ్మిదేళ్లకే తన పాటల ప్రస్థానం మొదలుపెట్టి సినీ గీతాలు పాడి టాలీవుడ్ ను ఊర్రూతలూగించే స్థాయికి చేరుకున్న ఈ సూపర్ సింగర్ తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ సుపరిచితమే. 18 ఏళ్లకు తన స్నేహితుడు శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది. ఆ విషయంలో కొంత వివాదం నడిచినా ఆ తర్వాత సద్దుమణిగింది. హైదరాబాద్ నల్లకుంటలో మధు ప్రియ కుటుంబం నివాసం ఉంటుంది. తన ఇంటి సమీపంలోనే ఉండే శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత వారి ప్రేమ వివాదంగా మారినా ఆ తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో ఘనంగా వివాహం జరిగింది.
తనకు బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ షీటీమ్స్ కు ఆమె ఫిర్యాదు మెయిల్ ద్వారా చేయగా వారు ఆమె ఫిర్యాదును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో మధుప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. మధుప్రియ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 509, 354 బీ సెక్షన్ ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ పాడిన పాట కూడా పెద్ద హిట్ అయింది. బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న మధు అందరికీ బాగా చేరువైన సంగతి మీకు తెలిసిందే.