ఈ మధ్యకాలంలో కొందరు పోలీసులు విధుల్లో ఉండగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు విధుల్లో ఉండగానే మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా ఓ ఎస్‌ఐ స్టేషన్ లోనే మహిళా కానిస్టేబుల్ తో మసాజ్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో మునీతా సింగ్ అనే మహిళ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల ఆ ఎస్‌ఐ స్టేషన్ లో ఉండగానే మరో మహిళా కానిస్టేబుల్ తో మసాజ్ చేయించుకున్నారు.
మునీతా సింగ్ మసాజ్ చేయించుకుంటుండగా.. అదే స్టేషన్ లో ఉన్న కొందరు వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. మసాజ్ చేయించుకున్న ఆ మహిళా ఎస్‌ఐని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఇదే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఇదే వీడియో కాస్త వైరల్ గా కూడా మారింది. స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్‌తో మసాజ్ చేయించుకున్న ఎస్‌ఐ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.