ప్రముఖ సీరియల్ నటి లహరి తెలుగులో ఎన్నో సీరియల్లో నటించింది. తన నటనతో ప్రేక్షకులందరికి తమ ఇంటి అమ్మాయి అనిపించేతంలా గుర్తింపు తెచ్చుకుంది. సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఓ యాక్సిడెంట్ తో లహరి వార్తల్లో నిలిచింది. మంగళవారం రాత్రి హైదరాబాదు శివారు ప్రాంతమైన శంషాబాద్ సమీపంలో లహరి నడుపుతున్న కారు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా లహరి తీవ్ర భయాందోళనలకు గురైంది. గుమికూడిన జనాలను చూసి భయంతో ఆమె కారు కూడా దిగలేదు.అక్కడి వచ్చిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆమె మద్యం సేవించిందేమో అనీ డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయించారు. అయితే పరీక్షలో ఆమె మద్యం తాగలేదని తేలింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి గాయపడ్డ వ్యక్తి గానీ అతని తరపున ఎవరూ ఫిర్యాదు చేయలేదు. దీంతో బుధవారం ఉదయం 11 గంటలకు స్టేషన్ కు రావాలని చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.