ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొంత మంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. దాంతో కుటుంబాల్లో విషాదాలు మిగులుతున్నాయి. తాజాగా ఉరి వేసుకుని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల మద్యప్రదేశ్ నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామానికి ఓ కుటుంబం వలస వచ్చింది. ఈ కుటుంబంలో తల్లి, కూతురు.. ఆమె మరిది ఒకే కుంటుంబానికి చెందిన వారు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతులు వాసుదేవ(27), రేఖ (28), సోనం(2)గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.