ఈ రోజుల్లో రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు దుండుగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వావివరసుల మరిచి మరీ అత్యాచారాలకు తెగ బడుతున్నారు. ఇన్నాళ్లు ఆడపిల్లలకు బయటే రక్షణ లేదని అనుకున్నాం. కానీ.. రాను రాను ఇంట్లో వాళ్ల మధ్య కూడా రక్షణ లేకుండా పోతుంది. ఏకంగా కన్న కూతురిపై తండ్రి బలవంతంగా అత్యాచారం జరిగిన ఘటనలు కూడా అనేకం చూశాం. తాజాగా ఇదే కోవకు చెందిన ఘటన మరోకటి చోటు చేసుకుంది. సొంత మేనమామ ఏకంగా కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతం. ఇక్కడే 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం మరో చోటకి వెళ్లడంతో కూతురిని మేనమామ ఇంట్లో వదిలి వెళ్లిపోయారు. ఇకపోతే కోడలిపై మేనమామ ఎప్పటి నుంచో కన్నేశాడు. ఎలాగైన కోడలితో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇక అతడు అనుకున్న రోజు కూడా రానే వచ్చింది. గత నెల రోజుల కిందట ఆ బాలిక మేనమామ ఆ యువతిని బలవంతంగా ఓ గదిలో బంధించాడు. అనంతరం కోడలిపై ఆ మామ అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఇక ఇంతటితో ఆగని ఆ దుర్మార్గుడు ఆ బాలికను అదే గదిలో నాలుగు రోజుల బంధించి.. తన ఫ్రెండ్స్ తో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ దారుణాన్ని తట్టుకోలేని ఆ బాలిక ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు ఆలస్యంగా వివరించింది. కూతురు మాటలు విన్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒంటికాలుపై లేచారు. ఈ దారుణాన్ని తట్టుకోలేక వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.