నేటి కాలంలో కొంత మంది పెళ్లైన మహిళలు భర్తలను కాదని పరాయి వాడితో వివాహేతర సంబంధాలకు ఆసక్తి చూపిస్తున్నారు. చివరికి తాళికట్టిన భర్త కన్నా.. ప్రియుడే ఎక్కువంటూ అతడితో లేచిపోవడం, లేదంటే భర్తను హత్య చేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ పెళ్లైన మహిళ.. భర్తను కాదని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇంతటితో ఆగకుండా అతడినే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. దీనికి ప్రియుడు నిరాకరించడతో కథ క్లైమాక్స్ లో ఊహించని ములుపుకు తిరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలోని శ్రీబాలిజీ కాలనీ. ఇక్కడే ఓ దంపతలు నివాసం ఉంటున్నారు. భర్త స్థానికంగా ఓ కంపెనీలో పనికి వెళ్తుండగా.. భార్య ఇంటిమాటునే ఉండేది. అయితే ఆ మహిళకు పక్కింటి పెళ్లైన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపు దాల్చింది. ఇక ఇంకేముంది, ఇద్దరు సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలా కొన్ని రోజులు గడిచింది. కానీ, ఆ మహిళకు భర్త కన్నే ప్రియుడే ఇష్టంగా మారాడు. దీంతో భర్తను వదులుకుని ప్రియుడితో ఉండాలనుకుంది.
అయితే ఆ మహిళ.. నా భర్తను వదిలేస్తా, నువ్వు నీ భార్యను వదిలేయ్. ఇద్దరం పెళ్లి చేసుకుందామని తెలిపింది. దీనికి ఆమె ప్రియుడు మాత్రం అంగీకరించలేదు. అయితే రోజు రోజుకు ప్రియురాలి టార్చర్ ఎక్కువవుతుండడంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఇలా అయితే కాదనుకున్న ప్రియుడు ఏకంగా ప్రియురాలిని చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. కానీ, ఎలా చంపాలో అతనికి అర్థం కాలేదు. దీని కోసం యూట్యూబ్ లో అనేక వీడియోలు చూశాడు. ఇక ఎట్టకేలకు ప్రియుడు తన ప్రియురాలి హత్యకు ప్లాన్ సిద్దం చేసుకున్నాడు. అయితే జనవరి 22న అతడు తన ప్రియురాలిని ఓ చోటకు రమ్మన్నాడు. ప్రియుడు చెప్పనట్లే.. నేను పుట్టింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పి ఆ మహిళ ఇంటి నుంచి వెళ్లింది.
అయితే ప్రియుడు ఆ మహిళను నమ్మించి ఓ అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక ప్రియురాలిని పదునైన ఆయుధంతో దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని భాగాలుగా కోసి చివరికి ఓ బావిలో పడేశాడు. ఇదిలా ఉంటే జనవరి 22 న ఆ మహిళ పుట్టింటికి రాలేదని అత్తమామలు అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఖంగుతిన్న భర్త.. జనవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అయితే పోలీసుల విచారణలో ఆ మహిళకు పక్కింటి వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని తేలింది. అనంతరం అతడిని విచారించగా.. చివరికి నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇదే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.