వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్లతో భార్యాభర్తలుగా ఒక్కటైన కొందరు వ్యక్తులు వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి సొంత సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఓ మహిళ పరాయి వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండగా భర్త అనుమానించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆమె భర్త భార్యను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా బెంగుళూరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసుల కథనం మేరకు.. అది రాయచూరు పరిధిలోని లింగసూగురు తాలుకా గుడదనాళ. ఇదే గ్రామంలో బెట్టప్ప, రేణుక అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కిందట వివాహం జరగగా, కొన్నిరోజులకు విరాట్, రాహుల్ అనే కుమారులు జన్మించారు. పుట్టిన బిడ్డలను చూసుకుంటూ ఆ భార్యాభర్తలు సంతోషమైన కాపురాన్నినెట్టుకొస్తున్నారు. అయితే ఇటీవల భార్య రేణుక పరాయి వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుండడం భర్త బెట్టప్ప కనిపెట్టాడు. దీంతో అనుమానం పెంచుకుని.., నా భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తుందని భావించాడు.
ఇదే విషయమై భార్యతో అనేక సార్లు గొడవకు దిగాడు. కాగా మంగళవారం కూడా భార్య ఫోన్ లో మాట్లాడుతుండడంతో అతని అనుమానం నిజమేనని అనుకున్నాడు. ఇక కట్టలు తెంచుకొచ్చే కోపాన్ని ఆపుకోలేకపోయిన బెట్టప్ప క్షణికావేశంలో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యను దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రేణుక రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం భర్త బెట్టప్ప పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన భర్త ఘాతుకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.