కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు కిరాతకులుగా మారుతున్నారు. కన్న కూతురన్న కనికరం లేకుండా బరితెగించి దుర్మార్గపు ఆలోచనలతో రంకెలేస్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో దారుణాలకు తెగబడుతూ తండ్రి తనానికి మాయని మచ్చ తెస్తున్నారు. సరిగ్గా ఇలాంటి దారుణానికే పాల్పడ్డ ఓ తండ్రి తన 14 ఏళ్ల కూతురిని తల్లిని చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆమెకు పుట్టిన బిడ్డను ఎవరూ చూడని టైమ్ లో చెరువులో పడేసే ప్రయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబ్ లోని జలంధర్ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ 14 ఏళ్ల కూతురు ఉంది. అయితే కన్న కూతురిపై కన్నేసిన తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కూతురిని బెదిరించి గత కొంత కాలం నుంచి అత్యాచారానికి బరితెగించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఈ దారుణానికి దిగినట్లు తెలుస్తోంది. ఇక కొన్నాళ్లకి ఆ బాలిక గర్భం దాల్చి ఏకంగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఎవరూ చెప్పొదని, చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం కూతురికి పుట్టిన ఆ పసిబిడ్డను ఆ తండ్రి స్థానికంగా ఓ కాలువలో పడేసే ప్రయత్నం చేశాడు.
దీనిని గమనించిన కొందరు స్థానికులు ఏంటని నిలదీశారు. అసలు విషయం బయటపడడంతో వెంటనే తండ్రిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి నా భర్త మాదక ద్రవ్యాలకు బానిసై, కూతురిని , నన్ను దారుణంగా హింసించాడని, అతనిని కఠినంగా శిక్షించాలని భార్య వేడుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. కన్న కూతురిని తల్లిని చేసిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.