సామాన్య ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే.. దేవుడి కంటే ముందు మొక్కేది వైద్యులకే. ఆ తరువాతనే దేవుడిని ప్రార్ధిస్తారు. కానీ కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరికొందరు ప్రాణపాయ స్థితిలోకి వెళ్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ ప్రాణాలతో వైద్యలు చెలగాటం ఆడారు. ప్రసవం కోసం వచ్చిన ఆమెకు శస్త్ర చికిత్స చేసి అందులోనే దూది గుడ్డను మరిచి కుట్లు వేసి పంపించిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రాంతంలోని బావని కుంట తండాకు చెందిన నూనావత్ దేవేందర్ భార్య సౌజన్య జూన్ 16న పురిటి నొప్పులతో బాధపడగా.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే సాధారణ ప్రసవమైంది. ఈ క్రమంలోనే ఆమెను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లీ, బిడ్డను పరీక్షించిన వైద్యులు.. వారిద్దరు ఆరోగ్యంగా ఉన్నారని, రక్తస్రావం అవుతుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. చిన్న శస్త్రచికిత్స చేసి.. కుట్లు వేస్తే సరిపోతుందని చెప్పి కుట్లు వేసి ఇంటికి పంపిచారు.
ఇక ఆ మరుసటి రోజు నుంచి సౌజన్య కడుపు నొప్పితో పాటు మంట తదితర సమస్యలతో బాధపడుతుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు.. ఆమెకు పరీక్షలు నిర్వహించారు. డెలవరీ సమయంలో ఆపరేషన్ చేసిన సమయంలో దూది కడుపులో పెట్టి కుట్లు వేసినట్లుగా గుర్తించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన దేవేందర్.. సౌజన్యను శుక్రవారం ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యులను నిలదీశాడు. కుట్లు వేసినప్పుడు పొరపాటున కాటన్ మరిచి కుట్లు వేశామని, తమను క్షమించమని కోరారన్నారు.
వెంటనే మళ్లీ శస్త్రచికిత్స చేసి కాటన్‌ను తొలగించి సౌజన్యకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అయితే బాధితురాలి భర్త ద్వారా విషయం బయటకు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రసూతి మహిళలు భయపడిపోతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రెండున్నరేళ్లుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. అసలు విషయం తెలిసి ఖంగుతున్న పోలీసులు!
ఇదీ చదవండి: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. గవర్నర్ తమిళిసై వైద్యం!