అమ్మానాన్నల దగ్గర గారాబంగా పెరిగింది. అంత ప్రేమను పంచే తల్లిదండ్రులు దొరకడం తన అదృష్టంగా భావించింది. జన్మజన్మలకు వాళ్లే తన తల్లిదండ్రులుగా రావాలని భావించింది. ఆ తల్లిదండ్రులు కూడా కుమార్తెను కళ్లల్లో పెట్టి చూసుకున్నారు. కుమార్తెకు పెళ్లీడు వచ్చాక.. తమలానే.. బిడ్డను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి భర్తగా రావాలని భావించారు. అన్ని విధాల తమ బిడ్డకు తగిన సంబంధం అని భావించి.. ఓ వ్యక్తిని చూసి.. తమకున్నంతలో బిడ్డ పెళ్లి ఘనంగా జరిపించారు. కుమార్తె అత్తారింట్లో చాలా సంతోషంగా ఉంటుందని భావించారు. కానీ విధి రాత మరోలా ఉంది. బిడ్డను బాగా చూసుకునే వాడిని భర్తగా తెచ్చామనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా కుమార్తె ఆత్మహత్య చేసుకుని.. వారికి తీరని విషాదం మిగిల్చింది. మరి ఆమెకు వచ్చిన కష్టం ఏంటి.. ఎందుకు.. ఇంతటి దారుణ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియాలంటే.. ఇది చదవండి..
భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన.. వివాహిత తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సోని అనే మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తాళలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. సోనికి మూడేళ్ల క్రితం.. ముత్తరం మండలం.. మచ్చుపేటకు చెందిన రమేష్‌తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం.. భార్యాభర్తలిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. దాంతో సోని.. పుట్టింటికి వచ్చింది.
అయితే భర్తను వదిలి వచ్చి.. పుట్టింట్లో ఉంటే సమాజం చులకనగా చూస్తుందని భావించింది. తన వల్ల తల్లిదండ్రులు తలదించుకోవద్దు.. వారికి భారం కాకూడదని భావించి దారుణ నిర్ణయం తీసుకుంది. బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె రాసిన సూసైడ్ నోట్.. ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తనకు చనిపోవాలని లేదని.. కానీ తన భర్త కారణంగానే ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నట్లు అని తెలిపింది.
సూసైడ్ నోట్‌లో ఇలా రాసి ఉంది.. ‘‘అమ్మానాన్న… మీతో కలిసి సంతోషంగా జీవించాలని వుంది. మీకు దూరంగా వెళ్లి చావడం కూడా నాకు ఇష్టం లేదు. మళ్లీ జన్మంటూ వుంటే మీ అందరి మధ్య పుడతాను. కానీ మళ్లీ వాడికి ఇచ్చి పెళ్లి చేయకండి’’ అని రాసుకొచ్చింది. ఈ లేఖ చదివిన వారు.. పాపం భర్త చేతిలో ఎంత నరకం అనుభవించి ఉంటే.. ఇంతటి దారుణ నిర్ణయం తీసుకుంటుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ తల్లిదండ్రలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. భర్త వేధింపులు తట్టుకోలేక.. ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. సమాజానికి భయపడి.. ఈ వివాహిత తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.