పల్నాడు జిల్లాలో ఇటీవల ప్రేమ వ్యవహారంలో భాగంగా ఓ యవకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బాధితుడి కుటుంబానికి పోలీసులు అన్యాయం చేస్తున్నారని మృతుడి సోదరుడు ఆవేదన తెలియజేస్తున్నాడు. ఇదే విషయమై ఏకంగా స్థానిక ఎస్పీని కలిసి ‘నా తమ్ముడిని అన్యాయంగా కొట్టి చంపేశారయ్యా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ ఫిర్యాదు చేశాడు.
అసలు ఏం జరిగిందంటే? రొంపిచెర్ల మండలంలోని బోనంవారిపల్లెకు చెందిన గౌతంరాజు(22) అనే యువకుడు అదే గ్రామానికి యువతితో ప్రేమలో పడ్డారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. అయితే ఈ నెల 6వ తేదీ గౌతం రాజు అమ్మాయి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి వివాహం చేయమని కోరారు. దీంతో కోపంతో ఊగిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు గౌతమ్ పై తీవ్రంగా దాడి చేశారు. చావాలంటూ బెదిరింపులకు గురి చేశారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: నా భార్య కంట్లో కారంపోసి కొడుతోంది.. ప్లీజ్ కాపాడండంటూ పోలీసులను వేడుకున్న భర్త!
దీంతో మనస్తాపానికి చెందిన గౌతమ్ అదే రోజు రాత్రి 8 గంటలకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే గమనించిన అతని కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. స్విమ్స్‌లో చికిత్స పొందిన గౌతమ్ చివరికి 19వ తేదీన మృతి చెందాడు. దీనిపై ఈ నెల 8వ తేదీ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా స్థానిక పోలీసులు ఎటువంటి న్యాయం చేయకుండా అస్సలు పట్టించుకోలేదని మృతుడి కుటింభికులు ఆవేదన తెలియజేశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.