మనిషిలో మానవత్వం పూర్తిగా లోపించి.. క్రూరత్వం పెరిగిపోతుంది. మంచి, చెడు అనే విచక్షణ పూర్తిగా మరిచిపోతున్నాడు. బంధాలన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. కన్నవారు, కట్టుకున్నవారు అనే కనికరం లేకుండా.. కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. మరీ కట్టుకున్న భార్య విషయం వచ్చేసరికి.. చాలా మంది మగవారికి ఏం అనిపిస్తుందో అర్థం కాదు.. భార్య అంటే వారి దృష్టిలో ఓ రోబో. భర్త అవసరాలు తీర్చే యంత్రంగా భావిస్తారు. డబ్బుల కోసం వేధిస్తారు.. కాదంటే.. క్రూరంగా ప్రవర్తిస్తారు. ఎంతకైనా తెగిస్తారు. వీరి చర్యల గురించి వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పరాయి మగాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఓ వ్యక్తి భార్యను నిత్యం వేధిస్తుండేవాడు. కాదన్నందుకు విచక్షణ కోల్పోయి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డల ముందే.. భార్యలను కడాయిలో మరుగుతున్న నీటిలో ముంచి చంపేశాడు. ఆ వివరాలు..
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న.. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని వంటగదిలో జ్యోతిలో నర్గీస్ అనే మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజౌర్ ఏజెన్సీకి చెందిన మహిళ భర్త ఆషిక్.. పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూండేవాడే. ఈ క్రమంలో ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా మూతపడిన పాఠశాలలోని సర్వెంట్ క్వార్టర్‌లో భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. అయితే, అతను తన భార్యను పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకొవాలంటూ బలవంతం చేసేవాడు. దీనికి అతని భార్య.. జ్యోతిలో నర్గీస్ ఒప్పుకునేదికాదు. దీంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో గత బుధవారం.. ముగ్గురు ఆడపిల్లల ముందే భార్య కాళ్ల చేతులు కట్టేసి.. కడాయిలో ఉడికించాడు. మరుగుతున్న నీళ్లలో భార్యను ముంచాడు. వేడికి తాళలేక.. ఆమె అక్కడే మరణించింది. ఈ దారుణ ఘటన తర్వాత ఆషిక్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వేరే ప్రాంతానికి పారిపోయాడు. అయితే.. బాధితురాలి 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని తెలిపింది.
దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు గురువారం పిల్లలను అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. పిల్లల వాంగ్మూలాలు పోలీసులు సేకరించారు. తమ తల్లిని.. కన్నతండ్రి ఉడకబెట్టడానికి ముందు దిండుతో ఊపిరాడకుండా చేసి, గొంతుకోసి చంపినట్లు తెలిపారు. మహిళ యొక్క ఒక కాలు కూడా ఆమె శరీరం నుంచి వేరు చేయబడిందని స్థానికులు తెలిపారు. మహిళ శవాన్ని పోస్ట్ మార్టం కోసం అధికారులు తరలించారు. ఈ ఘటన వెనుక కారణాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.