దేశంలో గత కొన్ని రోజుల నుంచి ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు ఇంటర్ అమ్మాయిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
గత కొన్ని రోజుల నుంచి ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. యువతి ప్రేమకు అంగీకరించలేదని, ప్రేమకు అడ్డుగా ఉన్నారంటూ కొందరు దుర్మార్గులు హత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాగే మరో ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ అమ్మాయిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాయగడ జిల్లాలోని బిసంకటక్ గ్రామం. ఇక్కడే నిహారిక అనే అమ్మాయి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానిక టౌన్ లో నిహారిక ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే ఆ యువతి ఇటీవల పరీక్ష రాసి గుమాడ గ్రామంలో నుంచి నడుచుకుంటూ వస్తుండగా.. ఓ యువకుడి నిహారిక రాకను గమనించాడు. మెల్లగా ఆ అమ్మాయి వద్దకు వెళ్లి మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ అమ్మాయి గట్టిగా అరిచింది. వెంటనే గమనించిన స్థానికులు ఆ యువకుడిని పట్టుకున్నారు.
అనంతరం మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్న నిహారికను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత స్థానికులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఇక ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. నిహారిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడికి పాల్పడిన ఈ దుండగుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.