Occults: నారాయణ పేట జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ మూగ జీవిని బలిచ్చి, దాన్ని కుండలో కుక్కి పూజలు నిర్వహించాడో మాంత్రికుడు. మత్తిస్థిమితం సరిగా లేని ఓ అబ్బాయికి బాగు చేస్తానంటూ సదరు మాంత్రికుడు ఈ క్షుద్ర పూజలకు తెరతీశాడు. చెరువులో పూజలు నిర్వహిస్తుండగా మత్స్యకారుల కంటపడటంతో విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే.. నారాయణ పేట జిల్లా, మద్దూరు మండలం, నందిపహాడ్‌కు చెందిన తిమ్మప్ప అనే బాలుడికి మతి స్థిమితం సరిగా లేదు. ఈ నేపథ్యంలో కుమారుడి ఆరోగ్యం బాగవాలని అతడి తల్లి చెన్నప్ప అనే మాంత్రికుడ్ని ఆశ్రయించింది. కొన్ని పూజలు చేస్తే బాలుడి ఆర్యోగం బాగవుతుందని మాంత్రికుడు చెప్పాడు. ఆమె సరేనంది. దీంతో చెన్నప్ప క్షుద్రపూజల కోసం మోతుకుంట చెరువును ఎంచుకున్నాడు.
మధ్యాహ్నం సమయంలో ఓ మేకను బలి చేసి, కుండలో కుక్కాడు. చెరువులో పూజలు చేసి బయటకు వస్తుండగా.. మత్స్యకారులు వారిని చూశారు. ఇక్కడ ఏం చేస్తున్నారని నిలదీశారు. దీంతో భయపడిపోయిన మాంత్రికుడు జరిగిందంతా వారికి చెప్పాడు. మత్స్యకారులు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు 20 వేల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, గ్రామస్తుల కారణంగా ఈ విషయం బయటకు పొక్కింది. చెరువులో క్షుద్ర పూజలు చేయటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, బాలింతలు తిరిగే చోట అలాంటి పనులు చేయటం ఏంటని మండిపడుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jubilee Hills Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. పథకం ప్రకారమే కం*మ్స్ ప్యాకెట్లు!