నిజామాబాద్ నవీపేట్ లో నవ వధువు రవళి డిసెంబర్ 11న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాబోయే భర్త సంతోష్ వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదే కేసులో తాజాగా ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. అసలు ఆత్మహత్యకు కారణం ఏంటి? నిజంగానే అతని వేధింపుల వల్లే రవళి ఆత్మహత్య చేసుకుందా? అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామాబాద్ కు చెందిన సంతోష్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో నవీపేటలో ఉన్న రవళి అనే యువతికి పెద్దలు నిశ్చితార్థం కుదిర్చారు. దీంతో అప్పటి నుంచి రవళి, సంతోష్ తరుచు ఫోన్ లో మాట్లాడుకునేవారు. సంతోష్ రవళిని పెళ్లికి ముందే జాబ్ చేయాలని, సంపాదించాలని వేధించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, రేపు పెళ్లి అనగా అర్థరాత్రి రవళి ఇంట్లో స్టోర్ రూమ్ లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక తెల్లారేసరికి నవ వధువు ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో రవళి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పెళ్లింట విషాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంతోష్ వేధింపులకు కారణంగానే మా కూతురు రవళి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న సంతోష్ ను సీడీఆర్ సాయంతో బుధవారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరు పరచడంతో కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.