Nizamabad: వివాహేతర సంబంధం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మామను హత్య చేయించిందో కోడలు. ఈ సంఘటన నిజామాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన నడిపి గంగారాం కుమారుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అతడి భార్య లత అత్తగారింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తన సమీప బంధువైన దుంపటి శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీలైనన్ని సార్లు ఇద్దరూ కలుసుకునేవారు. వీరి అక్రమ సంబంధం గురించి గంగారాంకు తెలిసింది. కోడలిని మందలించాడు. శ్రీనివాస్‌తో తన పొలం కౌలు మాన్పించాడు. అక్రమ సంబంధం విషయం మామకు తెలిసిపోవటంతో లత గత ఆరు నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల వరి కోతలు పూర్తి కావటంతో ఆ పంట మొత్తం తనకు ఇవ్వాలని లత పట్టుబట్టింది. శ్రీనివాస్‌తో కలిసి 23వ తేదీన మామతో గొడవపడింది.
24వ తేదీ ఆదివారం శ్రీనివాస్ తన మిత్రుడైన బి.సురేష్‌ను వెంట బెట్టుకుని గన్నారం వచ్చాడు. ఇద్దరూ వడ్ల కుప్పపై నిద్రపోతున్న గంగారంను దారుణంగా హత్య చేశారు. అలికిడి కారణంగా పక్క కుప్పపై నిద్రపోతున్న జాజుల పెద్ద నారాయణ అనే వృద్ధుడు మేల్కొన్నాడు. ఆ ఇద్దర్నీ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వాళ్లు ఆ వృద్దుడ్ని కూడా చంపాలని చూశారు. వేరే వాహనాలు అటుగా రావటంతో అక్కడినుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు నిజం ఒప్పుకోవటంతో వారిని రిమాండ్‌కు తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కడుపుతో ఉన్న భార్య నోట్లో యాసిడ్ పోసి చంపిన భర్త..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.