పెద్దనాన్న.. నాన్న తర్వాత నాన్న లాంటివాడు. అయితే ఈ వ్యక్తి కూతురిని చేరతీర్చాల్సిందిపోయి దుర్మార్గంగా వ్యవహరించాడు. సభ్య సమాజం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు ఈ వ్యక్తి చేసిన దారుణం ఏంటి? అంతలా దారి తీయటానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్‌కాలనీ. 13 ఏళ్ల బాలిక. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. దీంతో ఆ బాలిక ఎవరూ లేని ఆనాథలా మారింది. ఎవరి వద్ద ఉండాలో తెలియక సొంత పెద్దనాన్న ఇంట్లోనే నివాసం ఉండేది. తల్లి, తండ్రి మరణించడంతో ఆ బాలిక మానసిక స్థితి కూడా బాగలేదు. ఇదే అదునుగా భావించిన ఆ బాలిక పెద్దనాన్న కోరికలు పెంచుకున్నాడు. ఇంతటితో ఆగకుండా ఒంటరిగా ఉన్న ఆ చిన్నారిపై అత్యాచారానికి తెగ బడ్డాడు.
ఇది కూడా చదవండి: యువతిని వేధించిన పోకిరి.. నడిరోడ్డుపై కర్రతో చితకొట్టింది!అలా రోజు సమయం దొరికినప్పుడల్లా ఈ పాడుపనికి పాల్పడడంతో ఆ బాలిక చివరికి గర్భవతి అయింది. ఈ దారుణంలో స్థానిక ఏఆర్ కానిస్టేబుల్ కూడా పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్నాళ్లకు స్థానిక పోలీసులకు ఈ విషయం తెలియడంతో దుర్మార్గులపై కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అమాయకురాలైన యువతిని గర్భవతిని చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా మహిళా సంఘం కమిషనర్ ఆఫ్ పోలీసును కలిసి విజ్ఞప్తి చేసింది. ఇక అభం, శుభం తెలియని ఈ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డ ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.