కాలనీ వాసులు అంతా ఆ మహిళపై చెడు అభిప్రాయంతో చూశారు. ఇంతటితో ఆగకుండా ఆ మహిళ అలాంటి మనిషి అంటూ అసత్య ప్రచారం కూడా చేశారు. రోజు కలిసి మాట్లాడే మనుషులంతా దగ్గరకు రానివ్వకుండా అంటరాని మనిషిలా చూస్తున్నారు. వీటిన్నిటినీ చూసిన ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ మహిళపై అసత్య ప్రచారం చేయడానికి కారణం ఏంటి? ఇక ఈ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజమాబాద్ జిల్లాలోని వర్ని రోడ్డులో నాగలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి మంత్రాలు చేస్తుందని నాగలక్ష్మిపై కాలనీ వాసులంతా అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ అసత్య ప్రచరాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరగే ప్రజావాణిలో తనపై జరుగుతున్న ప్రచారంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ తనతో పాటు తెచ్చుకున్న పినాయిల్ ను తాగేసింది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: నీ కూతురు నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా.. యువతి తండ్రికి వాలంటీర్ వేధింపులుదీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ లో ఇద్దరు పేర్లను రాసినట్లుగా తెలిపారు. ఇక నాగలక్ష్మిపై ఇద్దరు వ్యక్తులు మంత్రిగత్తే అని అని వీడియోలు తీసి కాలనీ అంతా ప్రచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.